నాలుగేండ్లలో మహేశ్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు డైరెక్టర్ చేసిన ‘నీడ’ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1979లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత ‘పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు’ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ చిత్రాల్లో ఎక్కువగా ఆయన తండ్రితోనే కలిసి నటించడం విశేషం.