హీరో కాకముందు కృష్ణతో కలిసి నాటకాలు వేసిన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా?.. సినిమాల్లో ఆయన చాలా స్పెషల్‌

First Published Jul 23, 2024, 6:19 PM IST

సూపర్‌ స్టార్ కృష్ణ.. సినిమాల్లోకి రాకముందు నాటకాలు వేశారట. అంతేకాదు ఓ సూపర్‌ స్టార్ తో కలిసి ఆయన నాటకాలు వేశారట. మరి ఆయన హీరో ఎవరో తెలుసా?. 
 

మొదటి తరం నటుల్లో చాలా మంది నాటకాల ద్వారానే సినిమాల్లోకి వచ్చారు. నాటకాలే వారికి గుర్తింపు తెచ్చాయి. అవే సినిమాల వైపు నడిపించాయి. ఎన్టీఆర్‌, ఎస్వీఆర్, ఏఎన్నార్‌, కైకాల సత్యనారాయణ, అల్లూ రామలింగయ్య నుంచి అంతా నాటకాల ద్వారా సినిమాల్లోకి వచ్చిన వారే. వారిలో సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా ఉన్నారు. నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయన నటుడిగా ఆకట్టుకుని, స్టార్ గా ఎదిగి, సూపర్‌ స్టార్ గా నిలిచిపోయారు. 
 

1961లో సినిమాల్లోకి వచ్చాడు కృష్ణ ఘట్టమనేని. ఐదు దశాబ్దాలపాటు నటుడిగా రాణించి, 350కిపైగా సినిమాలు చేశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానూ రాణించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే సినిమాల్లోకి రాకముందు ఓ సూపర్‌ స్టార్‌తో ఆయనకు స్నేహం ఉండేదట. ఇద్దరు కలిసి నాటకాలు కూడా వేశారట. ఆ తర్వాత ఆయన ముందు హీరో అయితే, ఆ తర్వాత కృష్ణ ఆయన దారిలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదే స్థాయిలో సూపర్‌ స్టార్‌ అయ్యాడు. తనకంటూ సెపరేట్‌ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఆ సూపర్‌ స్టార్‌, ఆ అందగాడు ఎవరంటే?
 

Latest Videos


Sobhan Babu

ఆ అందగాడు, ఆ సూపర్‌ స్టార్‌ శోభన్‌బాబు. నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూ, మల్టీస్టారర్లు చేస్తూ సొంత హీరోగా ఎదిగాడు. సూపర్‌ స్టార్‌గా నిలబడ్డాడు. వీరికి దీటుగా సినిమాలు చేసి మెప్పించాడు. ఫ్యామిలీ చిత్రాలతో ఆయన ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యాడు. దానికి మించి అందగాడిగా, ఇంకా చెప్పాలంటే సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆడియెన్స్ మనసులో ఎప్పటికీ సోగ్గాడిగానే ఉండిపోవాలని చెప్పి, మంచి ఏజ్‌లోనే సినిమాలకు రిటైర్‌మెంట్‌ తీసుకున్నాడు. ఇప్పటికీ అలానే ఆడియెన్స్ గుండెల్లో ఉండిపోయాడు. 
 

అయితే శోభన్‌ బాబు సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో నటించేవాడట. అలా సూపర్‌ స్టార్‌ కృష్ణతోనూ కలిసి నటించాడట. ఓ ఇంటర్వ్యూలో కృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. శోభన్‌బాబు తనకు సినిమాల్లోకి రాకముందే మంచి స్నేహితుడు అని, ఇద్దరం కలిసి నాటకాలు కూడా వేశామని తెలిపారు. అయితే కృష్ణ కంటే ముందే శోభన్‌బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. 1959లోనే ఆయన `ధైరబలం` చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన చిత్రమిది. 
 

కృష్ణ సినిమాల్లోకి వచ్చాక, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాక శోభన్‌బాబు, కృష్ణ కలిసి చాలా సినిమాలు చేశారు. వీరి కాంబినేషన్‌లో  `గూఢచారి 116`, `లక్ష్మీ నివాసం`, `ముందడుగు`, `విచిత్ర కుటుంబం`, `బంగారు బాబు`, `మండే గుండెలు`, `ఇద్దరు దొంగలు`, `కురుక్షేత్రం`, `పుట్టినిల్లు మెట్టినిల్లు`, `కృష్ణార్జునులు`, `డాక్టర్‌ సినీ యాక్టర్‌`, `మహా సంగ్రామం`, `మంచి మిత్రులు`, `ప్రైవేట్ మాస్టర్`, `మా మంచి అక్కయ్య`, `తల్లికొడుకులు`, `అజేయుడు` వంటి దాదాపు 17 చిత్రాలు వచ్చి, ఆదరణ పొందాయి. మంచి హిట్‌ కాంబోగానూ నిలిచారు. శోభన్‌బాబు 2008లోనే 71ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు. కృష్ణ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో కన్నమూశారు. కానీ ఈ ఇద్దరు ఇండస్ట్రీలో ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌ స్టార్స్ గా నిలిచిపోయారు. 
 

click me!