వామ్మో సాయి పల్లవి రెమ్యూనరేషన్ అంతా... సమంత, అనుష్క, కాజల్ రేంజ్ కి చేరిందిగా!

First Published May 17, 2021, 8:18 PM IST

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు. తెలుగు పరిశ్రమకు పరిచయమైన అనతికాలంలోనే సాయి పల్లవి భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అందానికి మించి అభినయం, నాట్యంతో హీరోయిన్ గా ప్రసంశలు దక్కించుకుంటున్నారు. 
 

మలయాళ చిత్రం ప్రేమమ్ తో హీరోయిన్ గా వెండితెరకు పరిచమైన సాయి పల్లవి తమిళ్, తెలుగు పరిశ్రమల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ దక్కుతున్నాయి.
undefined
ప్రస్తుతం సాయి పల్లవి మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా ఉన్నారు. ఫిదా మూవీతో టాలీవుడ్ కి సాయి పల్లవిని శేఖర్ కమ్ముల తీసుకురాగా.. ఆయనతో రెండో చిత్రంగా లవ్ స్టోరీ మూవీ చేస్తుంది. ఈ నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.
undefined
ఇక రానా హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ రివొల్యూషనరీ అండ్ లవ్ డ్రామా విరాటపర్వం మూవీలో సాయి పల్లవి నటిస్తున్నారు. 90ల నాటి పల్లెటూరి అమ్మాయి లుక్ లో సాయి పల్లవి అలరిస్తున్నారు.
undefined
మరో పీరియాడిక్ చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీలో నానికి జంటగా నటిస్తుంది సాయి పల్లవి. సాయిపల్లవి బర్త్ డే కానుకగా ఈ చిత్రంలోని ఆమె లుక్ విడుదల చేయగా మెప్పించింది.
undefined
మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి రెమ్యూనరేషన్, సంపాదన తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. ఓ ఆన్ లైన్ సంస్థ సర్వే ప్రకారం దాదాపు సమంత, అనుష్కల రేంజ్ కి సాయి పల్లవి సంపాదన చేరిందట.
undefined
ఆ సంస్థ లెక్కల ప్రకారం 2020లో సాయి పల్లవి $3 మిలియన్ డాలర్స్ ఆర్జించారట. అలాగే ఆమె సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకుంటున్నారట. ఆ విధంగా కాజల్, తమన్నా వంటి స్టార్స్ సరసన చేరిందన్న మాట వినిపిస్తుంది.
undefined
ఇక సినిమాకు రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సమంత 2020లో $ 11 మిలియన్స్ సంప్రదించారట.
undefined
టాలీవుడ్ నుండి ఈ విషయంలో టాప్ లో అనుష్క ఉన్నట్లు సదరు సంస్థ తెలిపింది. $23 మిలియన్స్ సంపాదనతో అనుష్క అందరికంటే ముందు వరుసలో ఉన్నారట. అనుష్క సైతం రూ. 2 కోట్లకు పైగా సినిమాకు తీసుకుంటున్నారు.
undefined
click me!