బాత్ రూమ్ లో ఒంటరిగా గుక్క పట్టి ఏడ్చిన శోభ... దానికి పిచ్చి*** అంటూ అమర్ బూతులు!

Published : Nov 17, 2023, 03:38 PM ISTUpdated : Nov 17, 2023, 04:10 PM IST

బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతుంది. ఫైనల్ కి తీసుకెళ్లే అవిక్షన్ పాస్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. సంచాలక్ గా ఉన్న శోభ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైంది.

PREV
16
బాత్ రూమ్ లో ఒంటరిగా గుక్క పట్టి ఏడ్చిన శోభ... దానికి పిచ్చి*** అంటూ  అమర్ బూతులు!
Bigg Boss Telugu 7

అవిక్షన్ పాస్ పొందిన హౌస్ మేట్ కి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయి. ముఖ్యంగా ఎలిమినేట్ అయ్యే వరకూ వస్తే అది వాడుకుని సేవ్ కావచ్చు. ఫైనల్ కి మరో ఐదు వారాలే ఉన్నాయి కాబట్టి అవిక్షన్ పాస్ చాలా ఉపయోగపడుతుంది. అర్జున్ అవిక్షన్ పాస్ గెలిచాడు. అయితే బిగ్ బాస్ ఉల్టా పల్టా అంటూ టాప్ 5 తో పోటీపడి గెలుచుకోవాలని బిగ్ బాస్ అన్నాడు. 


 

26
Bigg Boss Telugu 7

ఫస్ట్ టాస్క్ లో యావర్ తో పోటీపడిన యావర్ ఓడిపోయాడు. పల్లవి ప్రశాంత్, శోభలను తదుపరి టాస్క్ లలో ఓడించి యావర్ ఫైనల్ కి వెళ్ళాడు. ఫైనల్ లో యావర్... ప్రియాంక, శివాజీలతో తలపడ్డాడు. యారో మీద బాల్స్ ని బ్యాలన్స్ చేసే ఈ గేమ్ కి శోభ, ప్రశాంత్ సంచాలకులుగా ఉన్నారు. మొదట ప్రియాంక బ్యాలన్స్ తప్పడంతో బాల్స్ క్రింద పడ్డాయి. 

36


అనంతరం శివాజీ కూడా బ్యాలన్స్ కోల్పోయాడు. యావర్ చివరి వరకూ ఉన్నాడు. అయితే సంచాలక్ గా ఉన్న శోభ డెసిషన్ పెండింగ్ పెట్టింది. యావర్ ఎక్కువ సమయం బాల్స్ ని బ్యాలన్స్ చేసినప్పటికీ... ఎవరు నిబంధనల ప్రకారం గేమ్ ఆడారో, దాని ఆధారంగా నిర్ణయించాలి అన్నది. 

 

46


ఈ విషయంలో శివాజీ శోభతో గొడవకు దిగాడు. నువ్వు సంచాలక్ గా ఉన్న మూడుసార్లు ప్రాబ్లమ్ ఎదుర్కొన్నావు. అందుకే నేను చెబుతున్నా అన్నాడు. అమర్ కూడా శోభను తప్పుబట్టారు. గేమ్ ఆడేటప్పుడు నువ్వు సరిగా చూడలేదేమో అన్నాడు. అందుకు శోభ సీరియస్ అయ్యింది. 

56
Bigg Boss Telugu 7


వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. శోభ ఎప్పుడూ ఫేవరిజం చూపిస్తుందని అమర్, ప్రియాంకలకు అనుకూలంగా మాట్లాడుతుందని శివాజీ-యావర్ అనుకున్నారు. అమర్.. శివాజీ ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కాడు. దాంతో శోభకు పిచ్చి*** అని ఓ బూతు పదం వాడాడు. గౌతమ్, ప్రియాంకలతో చెప్పాడు. 

66
Bigg Boss Telugu 7

తానుస్ట్రైట్ గా మాట్లాడితే ఎవరికీ నచ్చదు. అంటూ ఒంటరిగా బాత్ రూమ్ కి వెళ్లి ఏడ్చుకుంది. మరి ఈ పంచాయితీలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది వీకెండ్ లో నాగార్జున తేల్చాలి. అవిక్షన్ పాస్ మాత్రం యావర్ కి దక్కినట్లు సమాచారం. మరి ఈ పాస్ యావర్ ఎలా వాడుతాడు అనేది చూడాలి... 

 

Bigg Boss Top 5: టాప్ 5 ఎవరో లీక్ చేసిన భోలే షావలి... రసవత్తరంగా టైటిల్ రేస్!
 

Read more Photos on
click me!