కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ (Ajith Kumar) తమిళంలో ఎంత పెద్ద స్టారో మనందరికీ తెలిసిందే. ఈయన తెలుగువాడని కూడా అంటారు. ఇదిలా ఉంటే... అజిత్ తన తొలిచిత్రాన్ని కూడా టాలీవుడ్ లోనే చేశారు.
గొల్లపుడి మారుతీరావు గారి దర్శకత్వంలోని ‘ప్రేమ పుస్తకం’ అనే చిత్రంతో హీరోగా మారాడు. తొలిచిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో బిగ్ స్టార్ గా ఎదిగారు.
ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) ఈయన ప్రముఖ దర్శకుడు రవిరాజా తనయుడు. ఆది కూడా తమిళ ఇండస్ట్రీలోనే బాగా పాపులర్ అనే విషయం తెలిసిందే. కానీ ఆయన హీరోగా మొదటి సినిమాను తెలుగులోనే చేశారు.
ఒక vచిత్రం అనే మూవీతో హీరోగా మారాడు. ఆ తర్వాత కోలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ అనిపించుకున్నారు. హీరోగా తమిళంలో చాలా సినిమాలు చేశారు. ఇటు తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి కొడుకు వైభవ్ రెడ్డి (Vaibhav Reddy) తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఫస్ట్ మూవీని తెలుగులోనే చేశారు. హీరోగా తండ్రి దర్శకత్వంలో ‘గొడవ’ అనే చిత్రంతో నటించారు. తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ గా మారాడు.
నటుడు జీత్ (Jeet) ప్రస్తుతం బెంగాలీలో స్టార్ గా ఎదిగారు. కానీ ఆయన మొదటి చిత్రం టాలీవుడ్ లోనే తీశారు. ‘చందు’ అనే సినిమాతో తెలుగు హీరోగా అలరించాడు. బెంగాలీలోనూ సౌత్ చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు.