Sivakarthikeyan Net Worth : తమిళ నటుడు శివ కార్తీకేయన్ ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా?

First Published | Feb 19, 2024, 3:49 PM IST

కోలీవుడ్ స్టార్ శివ కార్తీకేయన్ (Siva Karthikeyan) తమిళంలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. చిన్నస్థాయి నుంచి ఎదిగిన విషయం తెలిసిందే. అయితే శివకార్తీకేయన్ ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించారో తెలిస్తే షాక్ అవుతున్నారు. 

తమిళ నటుడు శివ కార్తీకేయన్ తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిమిక్రీ ఆరిస్ట్ గా ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం ఇప్పుడు భారీ చిత్రాలతో బిజీగా ఉండే వరకు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో అలరిస్తున్నారు. 
 

12 ఏళ్లకు పైగా కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. హీరోగానే కాకుండా కమెడియన్ గా, సపోర్టివ్ రోల్స్ లోనూ శివకార్తీకేయన్ నటించారు. ప్రస్తుతం మాత్రం విభిన్న కథలు ఎంచుకుంటూ వస్తున్నారు. 


హీరోగా కొన్నేళ్ల నుంచి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్న శివకార్తీకేయన్ ప్రస్తుం ‘అమరన్’ (Amaran) సినిమాలో నటిస్తున్నారు.  మరోవైపు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రీసెంట్ గానే SK23 ప్రాజెక్ట్ కూడా ప్రారంభమైంది. 

అలాగే ఇటీవల శివకార్తీకేయన్ బర్త్ డే వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తమిళ నటుడి సంపాదన హాట్ టాపిక్ గ్గా మారింది. ఇన్నేళ్లుగా శివకార్తికేయన్ సంపాదన ఎంతో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే... 

నిర్మాతగా, నటుడిగా శివకార్తీకేయన్ కోట్లట్లో సంపాదిస్తున్నారు. వివిధ లగ్జరీ కార్లు, బంగ్లాలతో చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఆయన ఆస్తి విలువ మొత్తం రూ.250 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. 

అయితే శివ కార్తీకేయన్ కమెడియన్ స్థాయి నుంచి హీరోగా ఎదిగి.. అది కోలీవుడ్ పరిధిలోనే సినిమాలు చేస్తూ ఇంత సంపాదించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వరకు కేవలం 21 సినిమాలు చేశారు. నెక్ట్స్ 22వ సినిమా ‘అమరన్’ త్వరలో విడుదల కాబోతోంది. SK23 కూడా రూపుదిద్దుకుంటోంది. ఇందుకు రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. 

Latest Videos

click me!