బాలకృష్ణ కూడా దసరాకే వస్తే పరిస్థితేంటి?.. `దేవర` V/S `ఎన్బీకే109` మధ్య వార్‌ మామూలుగా ఉండదు?

Published : Feb 19, 2024, 03:31 PM ISTUpdated : Feb 19, 2024, 04:15 PM IST

నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇప్పటికే వార్‌ నడుస్తుంది. ఎన్టీఆర్‌, బాలయ్య అభిమానులు రెండుగా విడిపోయి గోల చేస్తున్నారు. అదే సినిమాల మధ్య పోటీ ఉంటే ఆ వార్‌ ఊహించడానికే భయంకరంగా ఉంటుంది.   

PREV
16
బాలకృష్ణ కూడా దసరాకే వస్తే పరిస్థితేంటి?.. `దేవర` V/S `ఎన్బీకే109` మధ్య వార్‌ మామూలుగా ఉండదు?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో తెరకెక్కుతుంది. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఆసక్తి ఏర్పడింది. దీంతోపాటు సినిమా స్టోరీ గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ అంచనాలు పెంచేసింది. సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి ఏర్పడింది. ఏప్రిల్‌ 5న ఈ మూవీ విడుదల కావాల్సి ఉండగా రిలీజ్‌ డేట్‌ని మార్చారు. దసరా స్పెషల్‌గా అక్టోబర్‌ 10న విడుదల చేయబోతున్నారు. 
 

26

ప్రస్తుతానికి దసరాకి రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. నాగచైతన్య నటిస్తున్న `తండేల్‌` కూడా దసరా స్పెషల్‌గానే రాబోతుంది. అక్టోబర్‌ 11న ఈ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది. `కార్తికేయ2` తర్వాత చందూమొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడం, ఇది కూడా సముద్రపు బ్యాక్‌ డ్రాప్‌లోనే రూపొందుతుండటంతో అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇందులో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తుంది. ఆమె హీరోయిన్‌గా నటిస్తుందంటే సినిమాలో విషయం ఉన్నట్టే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 
 

36

ప్రస్తుతానికి ఈ రెండు సినిమాల మధ్య క్లాష్‌ ఉంది. అయితే ఈ రెండు సినిమాలకు పెద్ద క్లాష్‌ అని చెప్పలేం. ఎన్టీఆర్‌ స్కేల్‌ వేరు, నాగచైతన్య మూవీ లెక్క వేరు. రెండు సినిమాలు ఈజీగా దసరాకి ఆడతాయి. ఆ స్కోప్‌ ఉంటుంది. పెద్దగా ప్రభావం ఉండదు. కానీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న మరో విషయమే ఇప్పుడు కలవరానికి గురి చేస్తుంది. పెద్ద సినిమా విజయదశమికి రాబోతుందనే టాక్‌ నెట్టింట, అటు ఫిల్మ్ నగర్‌ సర్కిల్‌లో చక్కర్లు కొడుతుంది. 
 

46

తాజాగా దసరా బరిలోకి బాలయ్య రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. భారీ స్కేల్‌లోనే ఈ మూవీని రూపొందిస్తున్నారు. సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతుంది. శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పొలిటికల్‌ హీట్‌ పెరిగిన నేపథ్యంలో షూటింగ్‌ కాస్త డిలే అవుతుందని తెలుస్తుంది. కానీ ఈ మూవీని దసరాకే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రాథమిక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

56

గతేడాది దసరాకి `భగవంత్‌ కేసరి` చిత్రంతో వచ్చాడు బాలయ్య. ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. పైగా బాలయ్య హ్యాట్రిక్‌ హిట్స్ తో ఉన్నారు. దీంతో ఎన్బీకే109పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ దసరాకి వస్తే పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్‌ `దేవర` దసరా బరిలో ఉంది. ఇప్పుడు బాలయ్య కూడా వస్తే బాక్సాఫీసు సునామీ అని చెప్పొచ్చు.

66

అదే సమయంలో ఫ్యాన్స్ వార్‌ పీక్‌లోకి వెళ్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఇద్దరి ఫ్యాన్స్ మధ్య గత కొంత కాలంగా వార్‌ సాగుతుంది. అదే ఇద్దరు సినిమాలు ఒకేసారి వస్తే థియేటర్లు పగిలిపోతాయి. ఓ వైపు సినిమాల మధ్య, మరోవైపు ఫ్యాన్స్ మధ్య వార్‌ పీక్‌లోకి వెళ్తుందని చెప్పొచ్చు. మరి ఏం జరుగుతుంది, మేకర్స్ అంతటి సాహసం చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories