అల్లు అర్జున్ కు ఎన్ని రకాల బిజినెస్ లు ఉన్నాయో తెలుసా? ఐకాన్ స్టార్ నెల సంపాదన తెలిస్తే షాకే!

First Published | Jun 28, 2023, 1:57 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అగ్రస్థాయి హీరోల్లో ఒకరిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సినిమాల పరంగానే కాకుండా బన్నీ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఆ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  రేంజ్ ‘పుష్ప’ చిత్రం తర్వాత ఏస్థాయికి చేరిందో తెలిసిందే. దేశవ్యాప్తంగా బన్నీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. దీంతో బన్నీ అప్ కమింగ్ ఫిల్మ్స్  పై అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం Pushpa 2కోసం ఎదురుచూస్తున్నారు. 
 

అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. సినిమాల విషయాలు అందరికీ తెలిసినవే. అయితే బన్నీ బిజినెస్ ల పరంగా కూడా దూకుడుగా ఉన్నారు. ఒకదాని తర్వాత ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తూ వస్తున్నారు. ఇక ఏడాదిలోనే రెండింటిని ప్రారంభించారు. దీంతో ఐకాన్ స్టార్ వ్యాపారాలపై ఆసక్తి నెలకొంది. 
 


రీసెంట్ గా అల్లు అర్జున్  AAA పేరుతో మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. జూన్ 15న ఈ థియేటర్ ను గ్రాండ్ గా ప్రారంభించింది. కోట్లతో ప్రారంభించిన ఈ మల్టీ ప్లెక్స్  అమీర్ పేటలో ఉంది. ఏఎంబీ తరహాలో తీర్చిదిద్దారు. సౌత్ లోనే ఎల్ఈడీ స్క్రీన్ ఉన్న ఫస్ట్ థియేటర్ ఇదే కావడం విశేషం.
 

అలాగే బన్నీ బార్ అండ్ రెస్టారెంట్ మరియు ఫుడ్ బిజినెస్ ను కూడా ప్రారంభించారు. వైల్డ్ వింగ్స్ బఫే పేరిట ఈ వ్యాపారం కొనసాగుతోంది.  జూబ్లీహిల్స్  రోడ్ నెం.36లో ఇది ఉంది. ఇది ప్రారంభించిన కొద్దికాలంలోనే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడి చాలా మంది ఫుడ్ తినేందుకు వస్తుండటం విశేషం. 
 

ఇక గతేడాది బన్నీ అల్లు స్టూడియోస్ ను కూడా ప్రారంభించారు. అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా స్టూడియోను స్థాపించారు. గండిపేట దగ్గర్లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు షూటింగ్ లు జరుగుతున్నాయి. అలాగే అల్లు అరవింద్ స్థాపించిన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’పైనా బన్నీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. 

ప్రస్తుతం నాలుగు రకాల బిజినెస్ లతో బన్నీ ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారు. ఒక్క నెల సంపాదనే రూ. కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇక సినిమాల రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్ లో చేరినట్టు తెలుస్తోంది. పుష్ప2 తర్వాత బన్నీ స్థాయి మరోలా ఉంటుందని అంటున్నారు. 

Latest Videos

click me!