అనుష్క శెట్టికి ఫస్ట్ లవ్‌ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? స్వీటి చేసిన పనికి నోరెళ్లబెట్టాల్సిందే

Published : Dec 06, 2024, 01:28 PM IST

అనుష్క శెట్టి తన ఫస్ట్ లవ్‌ ప్రపోజల్‌ గురించి వెల్లడించింది. తన క్లాస్‌ మేట్‌ చేసిన పనికి అనుష్క రియాక్షన్‌ మాత్రం క్రేజీ అని చెప్పొచ్చు.   

PREV
15
అనుష్క శెట్టికి ఫస్ట్ లవ్‌ ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? స్వీటి చేసిన పనికి నోరెళ్లబెట్టాల్సిందే

అనుష్క శెట్టి ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. ఇప్పటికీ లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే ఇటీవల ఆమె చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాయి. రెగ్యూలర్‌ కమర్షియల్‌ మూవీస్‌ కూడా చేయడం లేదు. అందుకే ఎక్కువగా కనిపించడం లేదు. రెండుమూడేళ్లకి ఒక్కో సినిమా చేస్తుంది. గతేడాది `మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి` చిత్రంతో అలరించింది. ఇప్పుడు `ఘాటి` సినిమాతో రాబోతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

25

ఇదిలా ఉంటే అనుష్క శెట్టి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆమెకి వచ్చిన ఫస్ట్ ప్రపోజల్‌ ని సంబంధించిన వార్త ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. రీల్‌ లైఫ్ లో చాలా మందితో ఆమెకి ఎఫైర్లు నడిచినట్టు రూమర్స్ వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్‌, నాగార్జునలతో లవ్‌ లో ఉందనే రూమర్స్ వచ్చాయి. కానీ అవి రూమర్లుగానే మిగిలాయి. ఇప్పుడు మాత్రం ప్రభాస్‌తోనే ప్రధానంగా వినిపిస్తుంది. 
 

35

ఇదిలా ఉంటే అనుష్క శెట్టి స్కూల్‌ టైమ్‌లోనే ప్రేమలో పడిందట. అంతేకాదు తనకు లవ్‌ ప్రపోజల్‌ వస్తే ఓకే చెప్పిందట. అనుష్క తన ఫస్ట్ ప్రపోజల్‌ గురించి చెప్పింది. తనకు ఫస్ట్ లవ్ ప్రపోజల్‌ ఎప్పుడు వచ్చిందో చెప్పింది. అయితే అదొక క్రేజీ క్రష్‌ అని చెప్పింది అనుష్క శెట్టి. స్కూల్‌లో అంటే తాను ఆరో తరగతి చదువుకునే సమయంలో తన క్లాస్‌ మేట్‌ ఒకరు తనని ప్రేమించాడట. చాలా రోజులుగా ప్రేమిస్తున్నాడట. 
 

45
Anushka Shetty

 ఓ రోజు వచ్చి `నువ్వు నాకు ఇష్టం` అని చెప్పాడట. దీంతో మరో మాట లేకుండా ఓకే అన్నదట అనుష్క. అయితే అది లవ్‌ ప్రపోజల్‌ అని ఆ టైమ్‌లో తనకు తెలియదని, అందుకే ఓకే చెప్పినట్టు తెలిపింది అనుష్క. ఆ తర్వాత ఆ విషయం తెలిసి ఎంతో నవ్వుకుందట. జయప్రద టాక్‌ షోలో ఈ విషయం చెప్పింది అనుష్క. మరి ఆ లవ్‌ ప్రపోజల్‌ తర్వాత ఏం జరిగిందనేది ఆమె చెప్పలేదు. 

55
Ghaati anushka

అనుష్క ప్రస్తుతం `ఘాటి` అనే సినిమాలో నటిస్తుంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఆమె పుట్టిన రోజు గ్లింప్స్ విడుదలైంది. ఇందులో విలన్లని అనుష్క ఊచకోత కోయడం గూస్‌ బంమ్స్ తెప్పిస్తుంది. అనుష్క అదిరిపోయే కమ్‌ బ్యాక్‌ కాబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతోపాటు మలయాళంలోనూ ఓ చేస్తుంది అనుష్క. 

read more:హీరోయిన్లతో ఏఎన్నార్‌ సరసం, అనుభవాలు బయటపెట్టిన వాణి శ్రీ.. మనవడు చెప్పింది నిజమే!

also read: మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీలో పెద్ద ట్విస్ట్, సినిమా క్యాన్సిల్‌?.. అఫీషియల్‌గా బాలయ్య ఏం చెప్పాడంటే?

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories