సౌందర్య తర్వాత ఆమె ప్లేస్ ఎవరిదో తెలుసా..ఆ ఇద్దరు హీరోయిన్లు అని ఎవరైనా ఊహించగలరా ?

First Published | Aug 19, 2024, 10:15 AM IST

దివంగత నటి సౌందర్య నటనని అభిమానించని వారు అంటూ ఉండరు.సౌత్ లో సౌందర్య విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలకు ఆస్కారం ఇవ్వకుండా అప్పటి స్టార్ హీరోయిన్లందరికి పోటీ ఇచ్చింది.

దివంగత నటి సౌందర్య నటనని అభిమానించని వారు అంటూ ఉండరు.సౌత్ లో సౌందర్య విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గ్లామర్ పాత్రలకు ఆస్కారం ఇవ్వకుండా అప్పటి స్టార్ హీరోయిన్లందరికి పోటీ ఇచ్చింది. కనై సౌందర్య దురదృష్టవ శాత్తూ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. 

అయితే సౌందర్య తర్వాత అంతలా ఫ్యామిలీ ఆడియన్స్ ని తన నటన, హోమ్లీ లుక్స్ తో కట్టి పడేసే హీరోయిన్ రాలేదు. స్నేహ లాంటి వాళ్ళు సౌందర్య స్థానాన్ని భర్తీ చేస్తారని అనుకున్నప్పటికీ ఆమె ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. సౌందర్య అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితో నటించింది. 


ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు సౌందర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె స్థానాన్ని భర్తీ చేసే హీరోయిన్ల గురించి చోటా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చోటా కె నాయుడు చాలా చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు.స్టార్ హీరోల సినిమాలు, చిన్న చిత్రాలు కూడా చేశారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రం గురించి మాట్లాడుతూ చోటా.. సౌందర్యని గుర్తు చేసుకున్నారు. 

ఒక్క అమ్మాయి తప్ప చిత్రం కోసం చాలా మంది హీరోయిన్లని అడిగాం. ఎవరూ ఒప్పుకోవడం లేదు. కథలో హీరోయిన్ పాత్ర ఇంపార్టెన్స్ ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ నిత్యామీనన్ కథ వినగానే ఒప్పేసుకుంది. హీరోయిన్ పాత్రలో ఉన్న ప్రాధాన్యతని పసిగట్టే ట్యాలెంట్ నిత్యా మీనన్ కి ఉంది. 

నేను వర్క్ చేసిన హీరోయిన్లలో సౌందర్య ఒక అద్భుతం అంతే.. ఆమెకి తిరుగులేదు. ఆమె తర్వాత  ఆ స్థాయి హీరోయిన్లు ఎవరా అని చూస్తున్నా. అప్పుడు సమంత వచ్చింది. సమంత బంగారం. ఆ తర్వాత నిత్యా మీనన్.. సమంత బంగారం అయితే నిత్యామీనన్ ప్లాటినమ్ అంటూ చోటా కె నాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. 

అయితే చోటా వ్యాఖ్యలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సౌందర్యతో నిత్యా మీనన్ ని పోల్చడం కొంతవరకు ఒకే అని నెటిజన్లు అంటున్నారు. కానీ సమంత పోల్చడం ఏంటి అని అంటున్నారు. సౌందర్య స్టైల్.. సమంత స్టైల్ పూర్తిగా వేరు. వీళ్ళిద్దరినీ పోల్చి చూడలేం అని అంటున్నారు. 

Latest Videos

click me!