Intinti Gruhalashmi: నువ్వు నా ఫీజు కట్టాల్సిన పనిలేదు నాన్న.. కాలేజీలో నందును ఘోరంగా అవమానించిన దివ్య!

Published : May 16, 2022, 12:32 PM IST

Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Intinti Gruhalashmi: నువ్వు నా ఫీజు కట్టాల్సిన పనిలేదు నాన్న.. కాలేజీలో నందును ఘోరంగా అవమానించిన దివ్య!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే పరందామయ్య (Parandamaiah) ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఇక నందు (Nandu) మీ మాజీ కోడల్ని జాబ్ వెతుక్కోమనండి. కానీ ఇంటర్వ్యూ కి వెళ్లిన చోట కొంచెం డిగ్నిటీ గా ఉండమనండి అని నందు అంటాడు. ఇక ఆఫీస్ లో జరిగిన వ్యవహారం గురించి వాళ్ళ తల్లిదండ్రులకు చెబుతాడు.
 

26

అంతేకాకుండా నందు (Nandu) కన్న కొడుకు గా మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఇక మీ దగ్గర ఉంటుంది కాబట్టి తులసి (Tulasi) బాధ్యత కూడా నాదే అని నందు అంటాడు. ఇక అనసూయ దంపతులు నందుని అనేక మాటలతోటి దెప్పి పొడుస్తారు. ఇక నన్ను ఏం చూసుకుని మీకు తెలిసిన అంత నమ్మకం అని అంటాడు. 
 

36

ఇక బియ్యం బస్తా మోయలేనిది.. సంసారాన్ని మోస్తుందా అని అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత లాస్య (Lasya) కనీసం మీ అమ్మానాన్న మిమ్మల్ని ఇంట్లోకి కూడా రమ్మన లేదు అని కోపం ఊగిపోతుంది. మరోవైపు ప్రరందామయ్యా మనం తులసి (Tulasi) కి భారంగా ఉన్నావేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక దివ్య కాలేజీ ఫీజు కట్టాలని తులిసికి తెలుస్తుంది.
 

46

ఈలోపు నందు (Nandu) దివ్య కాలేజీ ఫీజు కట్టడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వస్తాడు. ఇక ప్రిన్సిపాల్ దివ్య ను ఆఫీస్ రూమ్ లోకి పిలిపిస్తుంది. దివ్య (Divya) నా ఫీజు కట్టడానికి మీరెవరు అని నందు ను అడుగుతుంది. అది నా బాధ్యత అని నందు అంటాడు.
 

56

ఇక దివ్య (Divya) ఎప్పటి నుంచి మీకు ఈ బాధ్యతలు గుర్తుకు వస్తున్నాయి డాడ్ అని అడుగుతుంది. ఇక మా అమ్మ కాలేజ్ ఫీజ్ కడతా అన్నారు. ఒకవేళ కాలేజ్ ఫీజ్ కట్టక పోతే నేను కాలేజీకి రావడమే మానేస్తాను అని దివ్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఇంటికి వెళ్లిన దివ్య తులసి (Tulasi) వైపు కోపంగా చూస్తుంది.
 

66

ఇక తరువాయి భాగం లో తులసి (Tulasi) పార్క్ లో సంగీతాన్ని పలుకుతూ ఉంటుంది. అది గమనించిన ఒక ఆవిడ మీకు సంగీతం వచ్చా అని అడుగుతుంది. అంతే కాకుండా మా పిల్లలకు సంగీతం నేర్పుతారా? అని అడుగుతుంది. ఆ క్రమంలో తులసికి ప్రవళిక (Pravalika) గుర్తుకు వస్తుంది.

click me!

Recommended Stories