కోటు బటన్స్ విప్పేసి ప్రభాస్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ కృతి సనన్ బోల్డ్ షో... వైరల్ గా లేటెస్ట్ ఫోటోస్

Published : Jun 01, 2023, 08:06 AM IST

పొడుగు సుందరి కృతి సనన్ సూపర్ స్టైలిష్ ఫోజుల్లో హృదయాలు కొల్లగొట్టింది. సూటు బూటు వేసి లేడీ బాస్ వలె యాటిట్యూడ్ చూపింది. కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

PREV
16
కోటు బటన్స్ విప్పేసి ప్రభాస్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ కృతి సనన్ బోల్డ్ షో... వైరల్ గా లేటెస్ట్ ఫోటోస్
Kriti Sanon

చాలా కాలం తర్వాత కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ప్రభాస్ కి జంటగా ఆమె నటించిన ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. మూవీపై అంచనాలు పెంచేసింది. టీజర్ ట్రోల్స్ కి గురి కాగా ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. కృతి సనన్, ప్రభాస్... రాఘవుడు, జానకి పాత్రల్లో అలరించనున్నారు.

26
Kriti Sanon

మరోవైపు ప్రభాస్-కృతి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ట్వీట్స్ ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. త్వరలో ప్రభాస్-కృతి సనన్ ఎంగేజ్మెంట్ అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఆయన కామెంట్ ని బాలీవుడ్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. 
 

36
Kriti Sanon

కృతి-ప్రభాస్ ఎఫైర్ రూమర్స్ కి హీరో వరుణ్ ధావన్ కామెంట్స్ కూడా  కారణమయ్యాయి.గత ఏడాది విడుదలైన బేడియా మూవీ  ప్రమోషన్స్ కోసం కృతి సనన్, వరుణ్ ధావన్ ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు. సదరు షోలో యాంకర్ గా కరణ్ జోహార్ వ్యవహరించారు. కృతిసనన్ పేరు నీ గుండెల్లో ఎందుకు లేదని కరణ్, వరుణ్ ని అడిగారు. ఎందుకంటే... కృతి నేమ్ మరొకరి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేడు. మరోచోట దీపికా పదుకొనె తో షూటింగ్ లో చేస్తున్నాడని, వరుణ్ కామెంట్ చేశాడు. 

46
Kriti Sanon

పరోక్షంగా ప్రభాస్ కృతి సనన్ ని ప్రేమిస్తున్నట్లు వరుణ్ కామెంట్స్ ఉన్నాయి. కాగా ఈ రూమర్స్ పై కృతి సనన్ స్పందించారు. ఇవన్నీ నిరాధార కథానాలంటూ ఆమె కొట్టిపారేశారు. ప్రభాస్ తో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే మేము పెళ్లి చేసుకోవడం లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేల్చి పారేశారు.   

56
Kriti Sanon

ప్రస్తుతం కృతి  ఆదిపురుష్ తో పాటు టైగర్ ష్రాఫ్ కి జంటగా గణపథ్ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న గణపథ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. అలాగే మరో హిందీ చిత్రంలో కృతి సనన్ నటిస్తున్నారు.కృతి వెండితెరకు పరిచయమైంది తెలుగులోనే. దర్శకుడు సుకుమార్ ఆమెను హీరోయిన్ చేశాడు. వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ కి జంటగా కృతిని తీసుకున్నారు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు.

66
Kriti Sanon

పొడుగు సుందరి కృతి సనన్ సూపర్ స్టైలిష్ ఫోజుల్లో హృదయాలు కొల్లగొట్టింది. సూటు బూటు వేసి లేడీ బాస్ వలె యాటిట్యూడ్ చూపింది. కృతి సనన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories