Intinti Gruhalakshmi: అత్తతో ఛాలెంజ్ చేసిన దివ్య.. లాస్యకు సపోర్ట్ చేస్తున్న తులసి!

Published : May 22, 2023, 09:04 AM IST

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథనాలతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. సవతి తల్లి చెర నుంచి తన భర్తని కాపాడుకోవడానికి తపన పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Intinti Gruhalakshmi: అత్తతో ఛాలెంజ్ చేసిన దివ్య.. లాస్యకు సపోర్ట్ చేస్తున్న తులసి!

ఎపిసోడ్ ప్రారంభంలో మీ పద్ధతి నాకేం నచ్చలేదు అక్కయ్య. నీ కొడుకు వాళ్ల ముందు నా పరువు తీసినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు నోరు విప్పలేదు అంటూ నిలదీస్తాడు బసవయ్య. విక్రమ్ పేరు మీద ఉన్న ఆస్తి సంజయ్ పేరు మీదకి మారేవరకు విక్రమ్ ముందు నేను చెడ్డ అవ్వకూడదు అని తమ్ముడికి నచ్చచెప్తుంది రాజ్యలక్ష్మి.
 

29

ఇంతలో విక్రమ్ వచ్చి పంట డబ్బులు 10 లక్షలు తల్లికి ఇవ్వబోతాడు. దివ్య కూడా అదే టైంలో అక్కడికి వస్తుంది. ఇప్పుడు డబ్బు పెట్టవలసింది నా చేతిలో కాదు నీ భార్య చేతిలో నా పెద్దరికం ముగిసింది అంటుంది రాజలక్ష్మి. అలా ఎప్పటికీ జరగదమ్మా నీ చల్లని నీడలో ఉంటే మేము గోవర్ధనగిరి నీడలో ఉన్నట్లే.

39

మేము ఎంత పెద్దవాళ్లమైనా మీ పిల్లలమేనమ్మా ఈ ఇంట్లో ఎప్పటికీ నీదే పై చేయి అంటూ తల్లి చేతిలో డబ్బులు పెడతాడు విక్రమ్. దివ్య వైపు గర్వంగా చూస్తుంది రాజ్యలక్ష్మి. బసవయ్యకి డబ్బులు ఇచ్చి బీరువాలో పెట్టమనటంతో డబ్బు తీసుకుని ఆ దంపతులిద్దరూ వెళ్ళిపోతారు.
 

49

విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే దివ్య ఆపి ఈ షర్ట్ ఏంటి ఇలా నలిగిపోయింది నీ జుట్టు చెదిరిపోయింది అంటూ అత్తగారి ముందే భర్త జుట్టు సరి చేస్తుంది దివ్య. రాజ్యలక్ష్మి ఇబ్బందిగా చిన్నగా దగ్గుతుంది. సిగ్గుపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్. నా భర్తని నీ గుప్పెట్లో  పెట్టుకోవాలనుకున్నావు అది జరగనివ్వను అంటుంది దివ్య.
 

59

తెలిసిపోయిందా.. చూసావా నీ భర్త ఎప్పుడూ నా పెంపుడు కుక్కే అంటూ అహంకారంగా మాట్లాడుతుంది రాజ్యలక్ష్మి. అది ఒకప్పుడు ఇప్పుడు కాదు. తల మీద చేయి వేస్తేనే మెలికలు తిరిగిపోయాడు అలాంటిది ఒక్క ముద్దు పెడితే నా చేతిలోకి వస్తాడు ఛాలెంజ్ అంటుంది దివ్య. ఇద్దరూ ఆల్ ది బెస్ట్ చెప్పుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
 

69

మరోవైపు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా అసలే ఇబ్బందుల్లో ఉన్నావు అలాంటిది నువ్వు మరింత ఇబ్బందుల్లో కూరుకుంటున్నావు. లాస్య కి కావలసిన సాక్ష్యాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పజెప్పావు అంటూ నందు ని మందలిస్తాడు మాధవి భర్త. తులసిని అన్ని మాటలు అంటుంటే నేను భరించలేకపోయాను వెనకడుగు వేసి తనకి ఊడిగం చేయలేను.
 

79

అవసరమైతే నేను జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే అంతేకానీ వెనకడుగు వేసి నా పిల్లల ముందు నా పరువు పోగొట్టుకోలేను అంటూ ఆవేశంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు. ఇద్దరూ మొండి వాళ్ల మధ్య సయోధ్య కుదర్చటం జరగని పని. బావ ఎలాగూ తగ్గడు.. లాస్య అయినా తగ్గితే బాగుండు. తనతో ఎవరు మాట్లాడుతారు? పిల్లి మెడలో ఎవరు గంట కడతారు అని బాధపడతాడు మాధవి భర్త. మరోవైపు స్నానం చేసి బట్టలు తీసుకుందామని కబోర్డ్ తెరిచేసరికి అక్కడ బట్టలు కనిపించవు విక్రమ్ కి. దివ్య బట్టలు ప్లేస్ మార్చిందేమో అనుకుంటాడు విక్రమ్. 

89

కానీ దివ్య వచ్చి ప్లేస్ మార్చటం కాదు మొత్తం బట్టలే మార్చేశాను పాతకాలం నాటి బట్టలు వేసుకోవద్దు అంటూ మోడరన్ డ్రెస్ భర్తకి ఇస్తుంది. పూజలో ఉన్నాను కదా ఈ బట్టలు నేను వేసుకోకూడదంట అమ్మ చెప్పింది ఇవి వేసుకుంటే మళ్ళీ అమ్మ కోప్పడుతుంది అంటాడు విక్రమ్. మనసుకి నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అయినా ఈ బట్టలు మీరు వేసుకుంటే మీ అమ్మగారు సంతోషిస్తారు అంటుంది దివ్య. అవునా అంటూ బట్టలు వేసుకుంటాడు విక్రమ్. దివ్య ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి మీకు ఒక హీరోని పరిచయం చేస్తాను అంటూ మోడరన్ డ్రెస్ లో ఉన్న విక్రమ్ ని చూపిస్తుంది.

99

ప్రియ, విక్రమ్ వాళ్ళ తాతయ్య సంతోషిస్తారు కానీ రాజ్యలక్ష్మి వాళ్ళు షాక్ అవుతారు. నువ్వు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా ఇది నీకు పుట్టిన బుద్ధేనా లేకపోతే ఎవరైనా బలవంతం చేశారా అంటే కొడుకు మీద కేకలు వేస్తుంది రాజ్యలక్ష్మి.ఆయన వద్దన్నారు కానీ నా బలవంతం మీద వేసుకున్నారు అంటుంది దివ్య. తనకు తెలియకపోతే నీకు తెలియదా ఇన్నాళ్లు పద్ధతిగా పెంచుకున్నాను ఇప్పుడు దారి తప్పుతుంటే బాధనిపిస్తుంది అంటుంది రాజ్యలక్ష్మి. తరువాయి భాగంలో లాస్య ఇంటికి వస్తుంది తులసి. లాస్య కోరుకుంటున్న జీవితాన్ని, తను ఆశ పడుతున్న కెఫేని లాస్యకి వచ్చేలాగా చేస్తానని మాట ఇస్తుంది తులసి. ఈ విషయం తెలుసుకున్న నందు కోపంతో రెచ్చిపోతాడు.

click me!

Recommended Stories