తనకు ఎందుకు అవకాశాలు రావడం లేదో తాజాగా ఇంటర్వ్యూలో దివి వివరించింది. నేను మోడలింగ్ నుంచి యాక్టింగ్ కి వచ్చాను. మొదట్లో నన్ను చాలా మంది రిజెక్ట్ చేశారు. చేతిలోకి వచ్చి చేజారిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతారు. కొందరు నువ్వు సన్నగా ఉన్నావు అంటారు. మరికొందరు లావుగా ఉన్నావు అంటారు. వాళ్ళకోసం సన్నగా మారితే మరీ ఇంత సన్నగానా రిజెక్ట్ అనేస్తారు.