హిట్టిచ్చారని రెండవసారి అవకాశం ఇస్తే డిజాస్టర్ ఇచ్చిన దర్శకులు

First Published Aug 5, 2019, 12:09 PM IST

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. డైరక్టర్ అండ్ స్టార్ హీరోస్ కలిసి ఒక్క సక్సెస్ అందుకుంటే రెండవసారి కూడా ఆ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. అయితే దర్శకులను నమ్మి హీరోలు రెండవసారి అవకాశం ఇస్తే కొన్ని సార్లు అవి వర్కౌట్ కాకపోవచ్చు.

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కి ఉన్న క్రేజ్ మాములుగా ఉండదు. డైరక్టర్ అండ్ స్టార్ హీరోస్ కలిసి ఒక్క సక్సెస్ అందుకుంటే రెండవసారి కూడా ఆ కాంబో రిపీట్ అవ్వాలని కోరుకుంటారు. అయితే దర్శకులను నమ్మి హీరోలు రెండవసారి అవకాశం ఇస్తే కొన్ని సార్లు అవి వర్కౌట్ కాకపోవచ్చు. అలాంటి కాంబోలపై ఒక లుక్కేద్దాం పదండి.
undefined
పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోధన హిట్టవ్వగా ఆ తరువాత చేసిన దుశ్శాసన డిజాస్టర్ గా నిలిచింది.
undefined
పవన్ కళ్యాణ్ - ఎస్ జె.సూర్య: ఈ కాంబో ఫస్ట్ మూవీ ఖుషి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. కానీ సెకండ్ టైమ్ మాత్రం వీరి ప్లాన్ వర్కౌట్ కాలేదు. సెకండ్ మూవీ కొమరపులి ప్లాప్ గా నిలిచింది.
undefined
వివి.వినాయక్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఆది ఇండస్ట్రీ హిట్టవ్వగా.. ఆతరువాత వచ్చిన సాంబ యావరేజే హిట్ గా నిలిచింది. కానీ మూడవసారి వీరు కలిసి చేసిన అదుర్స్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.
undefined
సురేందర్ రెడ్డి - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన కిక్ హిట్టవ్వగా.. ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కిక్ 2 దారుణంగా చతికిలపడింది.
undefined
శంకర్ - విక్రమ్.మొదట అపరిచితుడు హిట్.. అదే క్రేజ్ తో వచ్చిన 'ఐ' మాత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.
undefined
శ్రీకాంత్ అడ్డాల - మహేష్ బాబు..బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ దెబ్బకు మహేష్ లో ఊహించని మార్పు వచ్చింది. అంతకుముందు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మెప్పించిన శ్రీకాంత్ రెండవసారి మాత్రం మహేష్ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
undefined
దశరథ్ - నాగార్జున: ఈ కాంబోలో వచ్చిన మొదటి సినిమా సంతోషం అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకోగా రెండవసారి వచ్చిన గ్రీకు వీరుడు మాత్రం నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
undefined
పూరి జగన్నాథ్ - పవన్ కళ్యాణ్: పూరికి మొదటి అవకాశం ఇచ్చి బద్రి సినిమాతో సక్సెస్ అందుకున్న పవర్ స్టార్ రెండవసారి మాత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లిక్కవ్వలేకపోయింది.
undefined
గుణశేఖర్ - మహేష్ బాబు: ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మహేష్ ఆ తరువాత గుణశేఖర్ తో అర్జున్ - సైనికుడు సినిమాలు చేశారు. ఆ సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి.
undefined
క్రిష్ - బాలకృష్ణ: క్రిష్ డైరెక్షన్ లో బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ తరువాత బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ కి మరో అవకాశం ఇవ్వగా.. ఆ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది.
undefined
సుకుమార్ - అల్లు అర్జున్: ఆర్య సినిమాతో ఇద్దరి కెరీర్ లు ఒక్కసారిగా స్పీడ్ అందుకున్నాయి. కానీ రెండవసారి బన్నీ పట్టుబట్టి చేసిన ఆర్య 2 మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఫామ్ లో ఉన్న సుకుమార్ కి బన్నీ మరో అవకాశం ఇస్తున్నాడు. ఎలాంటి సక్సెస్ ఇస్తాడో చూడాలి.
undefined
శ్రీను వైట్ల: దూకుడు సినిమాతో మహేష్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీను వైట్ల రెండవసారి ఆగడు సినిమాతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
undefined
click me!