లోకేష్ కనగరాజ్ పై మరో స్టార్ డైరక్టర్ వెటకారం వీడియో,ఇదేం ఏడుపు?

Published : Apr 29, 2024, 10:23 AM IST

రజనీకాంత్ తన చేతికి కూలీ అనే బ్యాడ్జ్ ధరించి ఎంట్రీ ఇచ్చారు. టీజర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో చూపించారు. అయితే అందులో ఉన్న గోల్డ్ మెటీరియల్ మాత్రమే కలర్ లో చూపించారు.

PREV
110
  లోకేష్ కనగరాజ్ పై మరో స్టార్ డైరక్టర్ వెటకారం వీడియో,ఇదేం ఏడుపు?


సాధారణంగా ఫామ్ లో ఉన్న దర్శకులు తెర వెనక ఎన్ని మాట్లాడినా, ఏమి మాట్లాడినా మైక్ ముందుకు వచ్చేసరికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. గబుక్కున వేరే వారిపై కామెంట్ చేయటానికి ఇష్టపడరు. అనవసరమైన వివాదాలు పనిమాలా కొని తెచ్చుకుని కెరీర్ ని కష్టాల్లోకి తొయ్యాలనుకోరు. అయితే కొందరు స్టార్స్,  డైరక్టర్స్ ఇందుకు అతీతం. ఏదో ఒకటి మాట్లాడి ఎప్పుడూ మీడియాలో నానుతూంటారు. నిజానికి తమిళ డైరక్టర్ వెంకట్ ప్రభు అలాంటివాడు కాదు. కానీ తాజాగా లోకేష్ కనరాజ్ ని ఇండైరక్ట్ గా కౌంటర్ చేస్తూ ఓ వీడియో తన సోషల్ మీడియా ఎక్కౌంట్ లో షేర్ చేసారు. వివరాల్లోకి వెళితే...

210

జైలర్, లాల్ సలామ్ సినిమాల తర్వాత తలైవా రజనీకాంత్ నటిస్తోన్న171 వ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తలైవర్ అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతోన్న ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు . త్వరలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజ‌ర్ విడుద‌ల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 

310
lokesh kanagaraj


టైటిల్ టీజర్ చూసిన రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రజనీకాంత్ తన చేతికి కూలీ అనే బ్యాడ్జ్ ధరించి ఎంట్రీ ఇచ్చారు. టీజర్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో చూపించారు. అయితే అందులో ఉన్న గోల్డ్ మెటీరియల్ మాత్రమే కలర్ లో చూపించారు. దీంతో సినిమా క‌థ గురించి ఓ హింట్ ఇచ్చారు. బంగారం, వజ్రాల వాచీల స్మగ్లింగ్ నేపథ్యంలో కూలీ సినిమా సాగుతుందని తెలుస్తోంది.

410
Lokesh Kanagaraj


అయితే ఈ టీజర్‌ను ఉద్దేశించి స్టార్ డైరెక్టర్‌ చేసిన పోస్ట్‌ తమిళ పరిశ్రమలో వివాదానికి దారితీసింది. రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని కొందరు కొట్టి పారేయగా.. మరికొందరు ఖండించారు. ఇంతకీ వెంకట్‌ చేసిన పోస్ట్‌ ఏంటి? అసలు అది ఎందుకు వివాదంగా మారింది

510
Lokesh Kanagaraj


దళపతి విజయ్ హీరోగా  గోట్‌ చిత్రీకరణలో బిజీగా ఉన్న దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కమర్షియల్ తమిళ సినిమా ట్రైలర్‌ ఫార్ములాపై చర్చించే రీల్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. అందుకో కమెడియన్‌ కార్తీక్‌ కుమార్‌ ప్రస్తుతం కమర్షియల్ సినిమాల ట్రైలర్స్‌ అన్ని ఓకే విధంగా ఉన్నాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ  అల్‌ను వెంకట్‌ ప్రభు ఇన్‌స్టాలో పంచుకోవడంతో కాంట్రవర్సీగా మారింది.

610
Rajinikanth Lokesh Kanagaraj


ఇదంతా రజనీకాంత్ కూలీ టీజర్‌ను ఉద్దేశించే పోస్ట్‌ పెట్టారని వెంకట్‌ ప్రభుపై నెటిజన్స్‌ మండిపడ్డారు. కూలీ టైటిల్ టీజర్‌ లక్ష్యంగా చేసుకున్నారని రజనీకాంత్ అభిమానులు ఆరోపించారు. అయితే మరికొందరు నెటిజన్స్‌ మాత్రం మద్దతుగా నిలిచారు. ఇదంతా జస్ట్‌ ఫన్నీ కోసమేనంటూ కొట్టిపారేశారు.

710
Lokesh Kanagaraj Thalaivar 171


తాజాగా తన పోస్ట్‌పై దర్శకుడు వెంకట్‌ ప్రభు క్లారిటీ ఇ‍చ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. " అలాంటిదేమీ కాదు.. ఇది మేమంతా చేస్తున్న కమర్షియల్ ఫ్లిక్ కోసమే.! అతను చెప్పేదాంట్లో కూడా కొంత నిజం ఉంది. మనం రెగ్యులర్‌ కమర్షియల్ టెంప్లేట్‌కు భిన్నంగా ఏదైనా ఇవ్వాలని ప్రయత్నిస్తే ఫ్యాన్స్‌ కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు " అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి వెంకట్‌ ప్రభు తెరదించే ప్రయత్నం చేసారు.  

810
lokesh kanagaraj

 లోకేశ్‌ మాట్లాడుతూ..  రజనీతో  సినిమా గురించి తెలియగానే మొదట కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి అభినందించినట్లు తెలిపారు.ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 2024 నాటికి అవి పూర్తవుతాయి. ఇది పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా. చాలా సంవత్సరాల తర్వాత రజనీకాంత్‌ ఇలాంటి సినిమాలో నటించనున్నారు. దీని స్క్రిప్ట్‌ విన్నాక ఆయన చాలా సంతోషించారు. అనిరుధ్, నేను కలిసి వెళ్లి ఆయనకు కథ వినిపించాం. వెంటనే ఆయన నన్ను కౌగిలించుకుని ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. చాలా సంతోషించాను’’ అని చెప్పారు. 
 

910
Lokesh kanagaraj


ఇక రజనీ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ కీలకపాత్ర పోషించనున్నారు. అలాగే ఇందులో అతిథి పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను ఇప్పటికే లోకేశ్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై రణ్‌వీర్‌ ఆసక్తిగా ఉన్నారని, కథ కూడా వినేందుకు అంగీకరించినట్లు సమాచారం.

1010
Lokesh Kanagaraj


ఇక ఇటీవల కమల్‌ హాసన్‌తో ‘విక్రమ్‌’ (Vikram), విజయ్‌తో ‘లియో’ (Leo), కార్తితో ‘ఖైదీ’ తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్‌ కొత్త కథలకు గత చిత్రాల్లోని పాత్రలను ముడిపెడుతూ సినిమాటిక్‌ యూనివర్స్‌ అనే కాన్సెప్ట్‌తో (Lokesh Cinematic Universe) అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగిస్తున్నారు. ఇప్పుడు ‘తలైవా 171’ కూడా అందులో భాగం కానుందో లేదో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

click me!

Recommended Stories