సరికొత్త పంథాలో చిత్రాలని తెరకెక్కించే దర్శకుడు సుకుమార్. ఆయన చిత్రాలు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల కంటే ఆయన చిత్రాలు భిన్నంగా ఉంటాయి. ఆర్య చిత్రంతోనే సుకుమార్ వైవిధ్యమైన దర్శకుడు అని అంతా భావించారు. సుకుమార్ కథ చెప్పే విధానం అద్భుతంగా ఉంటుంది. సుకుమార్ నేడు తన 55 వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.
దీనితో సుకుమార్ కి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సుకుమార్ కెరీర్ విశేషాలని అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. సుకుమార్ తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వ్యక్తి. దీనితో చిన్నతనం నుంచే సినిమాల ప్రభావం ఉంది. కాలేజ్ డేస్ కి వచ్చాక సినిమాలపై ఆసక్తి ఇంకా పెరిగింది. సుకుమార్ సినిమా రంగంలోకి రావడానికి స్ఫూర్తి నింపిన హీరో ఒకరు ఉన్నారట.
సుకుమార్ లాంటి డైరెక్టర్ కి స్ఫూర్తి కలిగించిన హీరో అంటే చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, రజినీకాంత్, శోభన్ బాబు, కృష్ణ లాంటి అగ్ర హీరోలు అనుకుంటారేమో..వీళ్ళెవరూ కాదు..రాజశేఖర్ అని సుకుమార్ తెలిపారు. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు సుకుమార్ రాజశేఖర్ సినిమాలు ఎక్కువగా చూసేవారు. అంకుశం, ఆహుతి, తలంబ్రాలు, మగాడు లాంటి చిత్రాలని చూసి ఆయనకి సుకుమార్ అభిమానిగా మారారట.
రాజశేఖర్ మ్యానరిజమ్స్ తో డైలాగులు చెబుతూ కాలేజ్ లో పెర్ఫామెన్స్ ఇచ్చేవాడట. సుకుమార్ పెర్ఫామెన్స్ ని అందరూ మెచ్చుకునేవారు. దీనితో రాజశేఖర్ కి సినిమారంగం పై ఇంకా ఆసక్తి పెరిగింది. తాను కూడా సినిమాల్లోకి వెళ్లి ఏదైనా సాధించాలి అనే నమ్మకం కలగడానికి రాజశేఖర్ కారణం అయ్యారట. ఆర్య చిత్రంతో డైరెక్టర్ గా మారిన సుకుమార్ పుష్ప 2 తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు.