రోజుకి పది మంది నా టార్గెట్. అది కూడా నెలకు పది రోజులు మాత్రమే. మిగతా 20 రోజులు నా వ్యాపకాలు వేరు. నా జీవితం నాది. ఇతర రాష్ట్రాలకు వెళతాను. త్వరలో ఓ పబ్ ఓపెన్ చేయబోతున్నాను, అన్నారు. జ్యోతిష్కులు అయ్యుండి పబ్ ఓపెన్ చేయడమేంటని యాంకర్ అడగ్గా.. తప్పేముంది. నా వృతి వేరు ప్రవృత్తి వేరు. నేను స్వామీజీని కాదు. పూజారిని కాదు. నా జాతకం ప్రకారం మద్యం వ్యాపారం కలిసొస్తుందని ఉంది. అందుకే ఆ వ్యాపారం చేయాలనుకుంటున్నాను, అన్నారు.