ఇండియాలో దిగ్గజ దర్శకులలో శంకర్ ఒకరు. అద్భుతమైన సందేశానికి భారీతనం, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు తీయడంలో శంకర్ తర్వాతే ఎవరైనా.డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు.
ఇక శంకర్ కుమార్తె అదితి శంకర్ తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా రాణిస్తోంది. అంతే కాదు అదితి శంకర్ గాయని కూడా. అదితి శంకర్ ఇప్పటికే వీరుమాన్, మావీరన్ లాంటి చిత్రాల్లో నటించి విజయాలు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఆమె మరో రెండు చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా అదితి శంకర్ రెండేళ్ల క్రితం మెడిసిన్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. 2021లో అదితి శంకర్ డాక్టర్ గా అధికారికంగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఆ సమయంలో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఫోటో షేర్ చేసింది.
ఇక నుంచి నేను డాక్టర్ అదితి శంకర్ అని కామెంట్ పెట్టింది. శంకర్ కూతురు డాక్టర్ గా వృత్తి ప్రారంభిస్తుంది అనుకుంటే 2022లో హీరోయిన్ గా మారింది. ఇక అదితి శంకర్ నటిగానే కొనసాగుతుందని అంతా భావించారు.
అయితే తాజాగా అదితి శంకర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. డాక్టర్లు సర్జరీ చేసే సమయంలో ధరించే గ్రీన్ దుస్తుల్లో, మాస్కుతో అదితి ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో కి అదితి Dr.A అని కామెంట్ పెట్టింది.
దీనితో అదితి డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టిందా అంటూ ప్రచారం జరుగుతోంది. శంకర్ కూతురు ఇంకా సినిమాలు పక్కన పెట్టి డాక్టర్ వృత్తిలో కొనసాగనుందా అంటూ నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. మరికొందరు మాత్రం అదితి నిజంగానే డాక్టర్ వృత్తిని స్వీకరించిందా లేక సినిమాలో పాత్ర కోసం ఆ గెటప్ లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో ఫుల్ క్లారిటీ రావాలంటే అదితి శంకర్ స్పందించాలి.