2023 అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది యానిమల్. భారీ హైప్ మధ్య డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మిక్స్డ్ రివ్యూస్ పడ్డాయి. ప్రేక్షకులు, క్రిటిక్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు పరమ చెత్త సినిమా అంటే మరొకరు అద్భుతం అన్నారు. A సర్టిఫికెట్ పొందిన యానిమల్ లో వైలెన్స్, సెక్స్, ఫౌల్ లాంగ్వేజ్ మోతాదుకు మించి ఉంది. అలాగే యానిమల్ పురుషాధిక్యతను ప్రోత్సహించేదిగా ఉందన్న ఆరోపణలు వినిపించాయి.