హీరో పవన్ కళ్యాణ్ కి వీరాభిమానిని అని చెబుతూనే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్స్ వేస్తుంటాడు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ మీద పవర్ స్టార్ టైటిల్ తో ఏకంగా సినిమానే చేశాడు. ఆ సినిమాలో చంద్రబాబు, లోకేష్, త్రివిక్రమ్, బండ్ల గణేష్ ల పాత్రల రిఫెరెన్సులు పెట్టాడు. పవన్ ఓటమి అనంతరం కోపంతో రగిలిపోయినట్లు, త్రివిక్రమ్, బండ్ల గణేష్ లను కొట్టినట్లు చూపించాడు. క్లైమాక్స్ లో నేరుగా వర్మ రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ కి హితబోధ చేశాడు. అప్పట్లో పవర్ స్టార్ మూవీ పవన్ అభిమానుల పుండు మీద కారం చల్లినట్లు అయింది.