Shakhahaari OTT Review
ఓటీటీలో ప్రతీవారం ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. దాంతో అద్బుతం అంటేనే థియేటర్ కి వెళ్లి జనం సినిమా చూస్తున్నారు. లేకపోతే ఓటిటిలో వస్తుందిలే అని వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇతర భాషా డబ్బింగ్ చిత్రాలు సైతం ఓటిటిలు కేరాఫ్ ఎడ్రస్ గా మారాయి.ముఖ్యంగా కన్నడ, మళయాళ, తమిళ చిత్రాలు గత కొంతకాలంగా ఓటీటీలో అలరిస్తున్నాయి. వాటిలో తాజాగా ట్రెండ్ అవుతున్న సినిమా శాఖాహారి. కన్నడంలో ఘన విజయం అందుతున్న ఈ సినిమా ఎలా ఉంది..కథేంటో చూద్దాం.
Shakhahaari
'శాఖాహారి' స్టోరీ లైన్
కర్ణాటకలో ఓ చిన్న మారుమూల ఊరిలో శాఖాహార హోటల్ నడుపుతుంటాడు సుబ్బన్న (రంగాయన రఘు). టేస్ట్ బాగుండటంతో చుట్టు ప్రక్కల వాళ్లంతా పెద్ద, చిన్నా తేడా లేకుండా ఆ హోటల్ కు వచ్చిపోతూంటారు. అయితే తనకు ఓ లవ్ ఫెయిల్యూర్ ఉండటంతో సుబ్బన్న వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని లీడ్ చేస్తూంటాడు. ఉదయం నుంచి హోటల్ కు వచ్చిపోయే జనంతో కళకళ్లాడుతూంటుంది. అతనికి కాలక్షేపం తన పాతకాలం రేడియోలోంచి వచ్చే పాటలు.
Shakhahaari
ఈ వంట మాస్టర్ కమ్ హోటల్ ఓనర్ అయిన సుబ్బన్న ఇలా తన జీవితాన్ని ప్రశాంతంగా నడుపుతున్న సమయంలో ఓ రోజున ఓ వ్యక్తి గాయాలతో వస్తాడు. తనను పోలీస్ లు వెంబడిస్తున్నారని, తన కాలులో ఆల్రెడీ పోలీస్ లు కాల్చిన బుల్లెట్ ఉందని , తనను రక్షించమని కొద్ది రోజులు తనకు షెల్టర్ ఇవ్వమని అంటాడు. చూస్తే అతను నిరపరాధిలా ఉంటాడు. జాలి వేస్తుంది సుబ్బన్నకు. దాంతో అతన్ని పొమ్మనలేక తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇల్లు, హోటల్ ఒకటే కావటంతో జనాలకు ఏదో అనుమానం వస్తూంటుంది.
Shakhahaari
ఇదిలా మరో ప్రక్క లోకల్ పోలీస్ ఆఫీసర్‌కు (గోపాలకృష్ణ దేశ్‌పాండే) విజయ్ కోసం తెగ వెతుకుతూంటాడు. అతని ట్రాన్సఫర్ పై ఈ కేసు ఆధారపడి ఉంటుంది. అలాగే విజయ్ ని తనే కాల్చి ఉండటంతో ఆ బుల్లెట్ తగిలి ఏమైనా అయితే ఏంటి పరిస్దితి అనే భయం అతన్ని తన టీమ్ తో కలిసి వెతుకుతూంటాడు. మరో ప్రక్క పై అధికారులు ప్రెజర్ ఉంటుంది. త్వరగా విజయ్ ని కనుక్కోమని, అతను కనుక చనిపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్తూంటారు.
Shakhahaari
ఇలా సుబ్బన్న ఉంటే అతన్ని తన హోటల్ లో ఎవరికి కనపడకుండా దాయటానికి నానా తిప్పలు పడుతూంటాడు. ఓ రోజు మొత్తానికి అతన్ని వేరే చోటకు పంపటానికి ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో ఓ అనుకోని సంఘటన సంఘటన జరుగుతుంది. సమస్య తీవ్రం అవుతుంది. ఇంతకీ ఏమిటా సంఘటన. సుబ్బన్న ఎందుకు అతను హంతకుడు అని తెలిసినా తన దగ్గర పెట్టుకునే ధైర్యం చేసాడు. పోలీస్ ఆఫీసర్ కు ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Shakhahaari
విశ్లేషణ
ఓటీటీ పుణ్యమా ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త శకం ప్రారంభం అయ్యిందనే చెప్పాలి. ఇలా ఇతర భాషల్లో హిట్టైన సినిమాలు ఎక్కువ కాలం కాకుండానే డబ్బింగై డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. క్రైమ్ థ్రిల్లర్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, హర్రర్ జోనర్ లో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. కన్నడం లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఉత్కంఠభరితంగా సాగే కథనంతో క్లిక్ అయ్యింది.
Shakhahaari
‘శాఖాహార’ కథని స్టైయిట్ నేరేషన్ లో చక్కగా చెప్పారు. అందులో చాలా లేయర్లు, ఇంకెన్నో పాత్రలూ ఉన్నా కేవలం నాలుగు పాత్రలే ప్రధానం చేసారు. అలాగే సస్పెన్స్ గా మొదలైన నేరేషన్ చివరికి ఆ లేయర్లనీ, ఆ పాత్రల్నీ ఒకే తాటికిపై తీసుకురావడంలో స్క్రీన్ ప్లే మ్యాజిక్ కనిపిస్తుంది.డైరక్టర్ తాను రాసుకొన్న ఏ పాత్రనీ వృధాగా వదల్లేదు.అన్ని చివర్లో తీసుకొచ్చి అన్ని డాట్స్ నీ కలపడంలో…దర్శకత్వ నేర్పు కనిపిస్తుంది. చిన్న చిన్న డిటైలింగ్స్ కూడా బాగా ఎలివేట్ చేసుకోగలిగాడు. ఇంత అవకాశం కేవలం ఇమేజ్ లేని ఆర్టిస్ట్ లు చిన్న సినిమాల్లోనే కనిపిస్తుంది. చిన్న చిన్న డిటైల్స్ వల్ల కథనంలో కొత్త ఇంట్రస్ట్ లు పుట్టాయి. మలుపులకూ, షాకింగ్ ఎలిమెంట్స్ కూ ఇలాంటి డీటైలింగ్స్ చాలా ఉపయోగపడ్డాయి.
Shakhahaari
టెక్నికల్ గా ...
ఇది ఓ గ్రిప్పింగ్ మిస్టరీ స్టోరీ. . సుబ్బన్న లాంటి వ్యక్తులు మనకు నిత్యం రోజువారి జీవితంలో తారసపడుతూంటారు. క్రైమ్ గురించి వింటేనే భయపడే ఓ వ్యక్తి అదే క్రైమ్ లో కూరుకుపోవాల్సి వస్తే అనేది ఎప్పుడూ ఆసక్తి కరమే. ముఖ్యంగా హోటల్ కు వచ్చే కష్టమర్స్ కళ్ల నుంచి తన దాస్తున్న వ్యక్తిని కాపాడటం పెద్ద టాస్కే. ఈ క్రమంలో అతని వింత ప్రవర్తనను కూడా వాళ్లు అనుమానిస్తూంటే దాన్ని కవర్ చేసే సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి.ఈ సినిమా ఇంత సక్సెస్ కు కారణం మనకు తెలుసున్న పాత్రలుతోనే కథను డిజైన్ చేయటం. దానికి తగినట్లే టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ తో డిజైన్ చేసారు. కన్నడంలో సీనియర్ నటుల్లో ఒకరైన రంగాయన రఘు ఈ సినిమాని పూర్తిగా తన భుజాలపై మోసాడు. సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లు, విజువల్స్, బీజీఎమ్ ఈ సినిమాకు హైలైట్ . అయితే కొంత హింసాత్మక దృశ్యాలు డోస్ తగ్గిస్తే బాగుండేది.
చూడచ్చా
థ్రిల్లర్ అభిమానులకు బాగా నచ్చే సినిమా. వీకెండ్ ని ఎంజాయ్ చేయటానికి ఈ సినిమా మంచి ఆప్షన్
ఏ ఓటిటిలో ఉంది
అమేజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది.