ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) - అలియా భట్ (Alia Bhatt) జంటగా నటిస్తున్నారు. నాగార్జున, అమితాబ్, షారుక్ వంటి స్టార్ క్యాస్ట్ కూడా కీలక పాత్రలను పోషించారు. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. ధర్మ ప్రొడక్షన్స్, స్టార్ స్టూడియోస్, ప్రైమ్ ఫోకస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మాతలుగా వ్యవహిరించారు. ప్రీతమ్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 9న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతోంది.