`సర్కారు వారి పాట`లోని చిల్లర సీన్లకు తల్లి సెంటిమెంటుని వాడుకోవడమా? డైరెక్టర్ పరశురామ్‌పై దారుణమైన ట్రోలింగ్‌

Published : May 19, 2022, 09:06 AM IST

`సర్కారు వారి పాట` దర్శకుడు పరశురామ్‌ దారుణంగా ట్రోల్స్ కి గురవుతున్నారు. కీర్తిసురేష్‌పై మహేష్‌బాబు కాలు వేసుకుని బెడ్‌పై పడుకునే సీన్‌పై ఆయన స్పందించిన తీరు పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. 

PREV
17
`సర్కారు వారి పాట`లోని చిల్లర సీన్లకు తల్లి సెంటిమెంటుని వాడుకోవడమా? డైరెక్టర్ పరశురామ్‌పై దారుణమైన ట్రోలింగ్‌

మహేష్‌బాబు(Maheshbabu) హీరోగా దర్శకుడు పరశురామ్‌ పెట్ల(ParasuramPetla రూపొందించిన `సర్కారు వారి పాట` (Sarkaru Vaari Paata)చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. ఈ సినిమాకి మొదటి రోజు దారుణమైన నెగటివ్‌ టాక్‌ వచ్చింది. కానీ కలెక్షన్లు ఫర్వాలేదంటున్నారు. ఈ వీకెండ్‌తో బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం బయ్యర్లకి, నిర్మాతలకు నష్టాలు మిగల్చదని ట్రేడ్‌ వర్గాల టాక్‌. మహేష్‌ సరికొత్త లుక్‌, కీర్తిసురేష్‌ అందాలు ఈ సినిమాకి ప్లస్‌. దీనికితోడు బ్యాంక్‌ కుంభకోణాల అంశం బాగా కనెక్ట్ అవుతుంది. 

27

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పలు అభ్యంతకర సీన్లపై చర్చ జరుగుతుంది. `నేను ఉన్నాను..నేను ఉన్నాను` అనే డైలాగ్‌, వంద వయాగ్రాలు వేసుకుని శోభనం కోసం ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకులా ఉన్నావనే డైలాగ్‌, దీంతోపాటు కీర్తిసురేష్‌పై మహేష్‌ కాలు వేసుకుని బెడ్‌పై పడుకునే సన్నివేశం, సుబ్బరాజుపై టాయిలెట్‌ పోసే సీన్‌ పట్ల ఆడియెన్స్ నుంచి, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నారు. మహేష్‌ నుంచి ఇలాంటివి ఊహించలేదంటున్నారు. 

37

వీటిపై ట్రోల్స్ రన్‌ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు పరశురామ్‌ని మీడియా ప్రశ్నించింది. దీనిపై దర్శకుడి స్పందన ఇప్పుడు మరోసారి ట్రోల్స్ కి గురవుతుంది. హీరోయిన్‌ కీర్తిసురేష్‌పై హీరో మహేష్‌ కాలు వేసే సన్నివేశంపై ఆయన స్పందిస్తూ, అందులో వల్గారిటీ ఏం లేదని తెలిపారు. ఒక తల్లిపై కొడుకు కాలేసుకుని పడుకున్నట్టుగా ఉందని, మహేష్‌ ఓ చిన్న పిల్లాడిలా పడుకున్నాడని తెలిపారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతుంది. 
 

47

అది ముమ్మాటికి వల్గారిటీగానే ఉందని ఖండిస్తున్నారు నెటిజన్లు. `మీకు కాదు, మాకు వల్గారిటీ లేదని అనిపించాలి డైరెక్టర్‌` అని,  `మన ఇంట్లో అమ్మాయిపై వేరే ఒకడు అలా కాలేసుకుని పడుకుంటే తెలిసేదం`టూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. `లవర్స్ బెడ్‌ సీన్‌ని తల్లి కొడుకుకి కన్వర్ట్ చేసిన గొప్ప దర్శకుడివి నువ్వే` అంటూ రెచ్చిపోతున్నారు.  ` ఆ సీన్‌లో కీర్తిసురేష్‌ చాలా అన్‌కంఫర్ట్ గా ఫీల్‌ అవుతుంది కదా సర్‌` అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

57

అంతటితో ఆగలేదు.. `ఓహో.. మహేష్‌బాబు ఏది చెబితే అది జనాలు ఫాలో అయిపోవాలి, ఆయన్ని నమ్మేయాలన్నమాట`, `అమ్మాయికి ఇష్టం లేకున్నా కాలు వేసుకుని పడుకోవడం తప్పుకాదంటారు. మళ్లీ అమ్మాయికి ఫోన్‌ చేసి మరీ పిలిపించుకోవడం తప్పుకాదంటారు. గ్రేట్‌ సర్‌ మీరు` అంటూ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు ట్రోలర్స్. అంతేకాదు మీమ్స్ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. మరోవైపు సుబ్బరాజుపై టాయిలెట్‌ పోయడం వల్గారిటీ కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇవి సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి.

67

దీంతోపాటు `నేను విన్నాను, నేను ఉన్నాను` అనే డైలాగ్‌ రాజకీయాల్లో వివాదం కావడంపై దర్శకుడు పరశురామ్‌స్పందిస్తూ, తన ఉద్దేశ్యం అది కాదని, హీరోయిన్‌కి హీరో ఇచ్చే భరోసా అని తెలిపారు. ట్రోల్స్, కాంట్రవర్సీ గురించి తనకు తెలియదని, తాను సోషల్‌ మీడియాని ఫాలో కాను అని చెప్పడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమా గురించి ఈ రేంజ్‌లో చర్చ జరుగుతుంటే, అది తనకు తెలియదని దర్శకుడు చెప్పడంపై కూడా దారుణంగా ఏసుకుంటున్నారు నెటిజన్లు. 

77

ఈ డైలాగ్‌ విషయంలో మహేష్‌బాబుని చిన్నప్పటి నుంచి ఆరాధించే టీడీపీ వర్గం అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. జగన్‌ డైలాగ్‌ని సినిమాల్లో వాడుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై చాలా హాట్‌ హాట్‌ చర్చే నడుస్తుంది. మరోవైపు వైసీపీ పార్టీ వాళ్లు ఈ విషయంలో మహేష్‌కి సపోర్ట్ గా నిలవడం, సినిమాని ఎంకరేజ్‌ చేయడం విశేషం. ఈ మొత్తంలో ఎపిసోడ్‌లో మహేష్‌ టీడీపీ వర్గానికి వ్యతిరేకం అయ్యాడని, వైసీపీ దగ్గరయ్యాడనే చర్చ నడుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories