హీరోయిన్ పాత్ర వల్లే నితిన్ సినిమా డిజాస్టర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్

First Published Aug 5, 2022, 11:53 AM IST

దర్శకుడు పొరపాటు చేస్తే ఆ ప్రభావం మూవీ రిజల్ట్ పై పడుతుంది. గతంలో తాను అలాంటి పొరపాట్లే చేశాను అని హను రాఘవపూడి అంటున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, అందాల రాక్షసి చిత్రాలతో హను ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు.  

సినిమాకి కెప్టెన్ దర్శకుడే. అతడు తీసుకునే నిర్ణయాల వల్లే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. దర్శకుడు పొరపాటు చేస్తే ఆ ప్రభావం మూవీ రిజల్ట్ పై పడుతుంది. గతంలో తాను అలాంటి పొరపాట్లే చేశాను అని హను రాఘవపూడి అంటున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, అందాల రాక్షసి చిత్రాలతో హను ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు పొందారు.  

ఆ తర్వాత హను తెరకెక్కించిన లై, పడి పడి లేచే మనసు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచాయి. తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈ చిత్రాల ఫలితం తారుమారైంది అని హను రాఘవపూడి అన్నారు. హను రాఘవపూడి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ సీతారామం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

లై సినిమా విషయంలో నేను రెండు పెద్ద తప్పులు చేశాను. అందువల్లే సినిమా ఫలితం అలా అయ్యింది. మొదట ఈ చిత్ర కథని హీరో విలన్ మధ్య పోరుగా మాత్రమే రాసుకున్నా. ఆ తర్వాత కమర్షియల్ అంశాల కోసం హీరోయిన్ మేఘా ఆకాష్ పాత్ర పెట్టాల్సి వచ్చింది. దీనివల్ల అనవసర సన్నివేశాలు ఎక్కువ కావడంతో కథ పక్కకు పోయింది. 

ఇక రెండవ కారణం సమయం సరిపోలేదు. ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించడం వల్ల వేగంగా షూటింగ్ చేయాల్సి వచ్చింది. రోజుకు 20 గంటలు పనిచేశా. యుఎస్ లో 60 రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి సమయం సరిపోలేదు. దీనితో షూట్ చేసిన ఫుటేజ్ రీ చెక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. పూర్తి చిత్రాన్ని నేను చూడకుండానే రిలీజ్ చేశాం అని హను రాఘవపూడి అన్నారు. 

ఇక పడి పడి లేచే మనసు చిత్రం విషయంలో సాయి పల్లవికి జబ్బు ఉందని దాచి పెట్టాలని అనుకున్నా. ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారని భావించా. కానీ అలా చేయడం ప్రేక్షకులకి నచ్చలేదు అని హను తెలిపారు. తన చివరి రెండు చిత్రాలు నిరాశ పరచడానికి కారణం ఇదే అని హను తెలిపారు. 

హను తాజాగా తెరకెక్కించిన సీతారామం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంతో హను రాఘవపూడి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. 

click me!