భారీ రెమ్యునరేషన్ వదులుకుని మహేష్ తో వరుసగా మూడు చిత్రాలు.. ఎక్కడ తేడా కొట్టిందంటే..

First Published May 10, 2024, 3:25 PM IST

మహేష్ బాబు తన కెరీర్ లో కొందరు డైరెక్టర్ ని రిపీట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 3 చిత్రాలు, గుణశేఖర్ తో మూడు చిత్రాలు, పూరి జగన్నాధ్ తో రెండు, శ్రీనువైట్ల తో 2, కొరటాల శివ తో రెండు చిత్రాలు చేశారు . 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్నివేశానికి తగ్గట్లుగా మహేష్ బాడీ లాంగ్వేజ్ మారిపోతూ ఉంటుంది. అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న మాస్ హీరోల్లో మహేష్ ఒకరు. కామెడీ సన్నివేశం అయినా, యాక్షన్ అయినా, ఎమోషన్ అయినా అందుకు తగ్గట్లుగా మహేష్ తన బాడీ లాంగ్వేజ్ మ్యాజరిజమ్స్ మార్చుకోవడం చూస్తున్నాం. 

మహేష్ బాబు తన కెరీర్ లో కొందరు డైరెక్టర్ ని రిపీట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో 3 చిత్రాలు, గుణశేఖర్ తో మూడు చిత్రాలు, పూరి జగన్నాధ్ తో రెండు, శ్రీనువైట్ల తో 2, కొరటాల శివ తో రెండు చిత్రాలు చేశారు . 

అయితే గుణశేఖర్ కి ఒక ప్రత్యేకత ఉంది. మహేష్ బాబుతో మూడు చిత్రాలు వరుసగా డైరెక్ట్ చేసిన దర్శకుడు ఆయనే. ఒక్కడు, అర్జున్, సైనికుడు చిత్రాలని గుణశేఖర్ మహేష్ తో తెరకెక్కించారు. ఈ మూడు చిత్రాల మధ్యలో గుణశేఖర్ మరో హీరోతో సినిమా చేయలేదు. 

అయితే ఇందులో ఒక్కడు మాత్రమే సూపర్ హిట్. అర్జున్ యావరేజ్ గా నిలిచింది. సైనికుడు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు ఇచ్చిన అవకాశాన్ని మీరు మిస్ యూజ్ చేసారా అని యాంకర్ ప్రశ్నించగా గుణశేఖర్ సమధానం ఇచ్చారు. వర్క్ పై సిన్సియర్ గా ఎఫర్ట్ పెట్టే ఏ దర్శకుడికి అయినా మహేష్ వాల్యూ ఇస్తారు. నా గురించి మహేష్ కి తెలుసు కాబట్టి మూడు చిత్రాలకు అవకాశం ఇచ్చాడు. 

నేను కూడా ఒక్కడు తర్వాత భారీ రెమ్యునరేషన్ ఆఫర్స్ వచ్చినప్పటికీ మహేష్ కోసం వదులుకుని అర్జున్ మూవీ చేశా. ఒక్కడు తర్వాత ఏర్పడిన అంచనాల వల్ల ఆయా చిత్రం సూపర్ హిట్ కాలేదు. కనై యావరేజ్. ఎవరికీ నష్టం కలగలేదు. 

ఇక సైనికుడు అంటారా అది వర్కౌట్ కాలేదు. కథపై నేను మహేష్ నమ్మకం పెట్టుకున్నాం. అది ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ ప్రయత్న లోపం మాత్రం లేదు అని గుణశేఖర్ అన్నారు. ఇక్కడ మిస్ యూజ్ చేసుకోవడం లాంటిది ఏమీ లేదు. కలసి జర్నీ చేసినప్పుడు కొన్ని సక్సెస్ అవుతుంటాయి మరికొన్ని కావు అని అన్నారు. 

click me!