దర్శకుడు భారతీరాజా ఇంట్లో విషాదం.. కొడుకు గుండెపోటుతో కన్నుమూత

Published : Mar 25, 2025, 08:44 PM ISTUpdated : Mar 25, 2025, 08:57 PM IST

Manoj Bharathi Passed Away: చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, నటుడు భారతీరాజా కొడుకు మనోజ్ భారతి హఠాన్మరణం చెందారు. 

PREV
12
దర్శకుడు భారతీరాజా ఇంట్లో విషాదం.. కొడుకు గుండెపోటుతో కన్నుమూత
భారతీరాజా, మనోజ్

దర్శకుడు భారతీరాజా దర్శకుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. దిగ్గజ దర్శకుడిగా రాణించారు. ఇప్పుడు నటుడిగా అడపాదడపా కనిపిస్తున్న ఆయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన కొడుకు హఠాన్మరణం చెందారు. 

భారతీరాజా కొడుకు మనోజ్ భారతి కొన్ని సినిమాల్లో నటించాడు. `తాజ్ మహల్` సినిమాతో మనోజ్ పరిచయం అయ్యాడు. `సముద్రం`, `కడల్ పూక్కల్‌` సినిమాల్లో కూడా నటించాడు.

22
మనోజ్ భారతి కన్నుమూశారు

మనోజ్‌ భారతీరాజాకి సడెన్‌గా గుండెపోటు రావడంతో కన్నుమూశారు. ఆయన వయసు 48 ఏళ్లు. ఈ ఏజ్‌లోనే ఆయన గుండెపోటుతో కన్నుమూయడం అత్యంత విచాకరం.  1999 నుంచి నటుడిగా రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 18 సినిమాల్లో నటించారు. నటుడిగా పెద్దగా గుర్తింపు రాలేదు.

దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రెండేళ్ల క్రితం `మార్గాజి తింగల్‌` అనే మూవీని రూపొందించారు. కానీ ఈ సినిమా ఆడలేదు.  ఆయన 2006లో నటి నందనని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories