బాలరాముడికి సూర్యతిలకం..రాజమౌళి ముందే చెప్పిన ఐడియానా?

First Published Apr 18, 2024, 9:00 AM IST

బాలరాముడికి సూర్యుడు తన కిరణాలతో తిలకం దిద్దే.. ఆ అబ్బుర దృశ్యాన్ని చూసి.. భక్తులు తన్మయత్వం చెందారు.

Rajamouli


రాజమౌళి సినిమాల్లో విజువల్స్, వాటి వెనక ఉన్న ఐడియాలు ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. వాటి గురించి జనం ఎప్పుడూ చర్చిస్తూనే ఉంటున్నారు. ఆయన ఈ రోజున చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల వెనక చాలా కృషి ఉంటోంది. అలాగే ఆయన సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ కూడా పాపులర్ అవుతున్నాయి. రీసెంట్ గా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఒక‌ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్‌  తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే...

surya-tilak-at-ayodhya-ram-mandir-7


అయోధ్య రామ్‌లల్లా(Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ట తరువాత బుధవారం తొలి శ్రీ రామ నవమి(Sri Rama Navami) వేడుకలు ఆలయంలో కనులపండువగా జరుగాయి.ఈ క్రమంలో అందరి దృష్టి శ్రీ రాముడి నుదిటిపై పడే సూర్యుడి కిరణాలపై పడింది. శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. 
 

surya tilak pics


ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం(Surya Tilak) ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆవిష్కృతమైంది. మూడున్నర నిమిషాలపాటు సూర్య తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది.
 

surya tilak pics

రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాల రాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట. సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. అయితే  సందర్బంలో ..ఇంతకు ముందు రాజమౌళి అమరావతి రాజధాని కు చెందిన వీడియో ప్రెజంటేషన్ వీడియో వైరల్ అవుతోంది.


అప్పట్లో అమరావతి రాజధాని పరిపాలనా నగరంలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లపై సినీ దర్శకుడు రాజమౌళి లండన్‌లో నార్మన్‌ ఫోస్టర్‌ ఆర్కిటెక్ట్‌ సంస్థ ప్రతినిధులకు  దర్శకుడు రాజమౌళి సలహాలిచ్చారు. అమరావతిలో భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై సదస్సులో రాజమౌళి భవనాల డిజైన్లు ఎలా ఉండాలనే దానిపై దర్శకుడు రాజమౌళి ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు.   అసెంబ్లీ భవనం ఎలా ఉండాలి, ఇక్కడి చరిత్ర, సంస్కృతి, వారసత్వం తదితర అంశాలను ఆయన వివరించినట్లు తెలిసింది. ఆ పని మీద లండన్ వెళ్ళి వచ్చారు రాజమౌళి.  


ఆ క్రమంలోనే  అసెంబ్లీలో తెలుగు తల్లి విగ్రహం యొక్క డిజైన్ ను రాజమౌళి రూపొందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏపీ ప్రభుత్వం విడుదల చేయగా, వీక్షించిన వారందరూ రాజమౌళి ప్రతిభకు ఫిదా అయ్యారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామిపై సూర్య కిరణాలు ఎలా అయితే ప్రతిబింభించి దర్శనమిస్తాడో, అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా కంప్యూటరైజ్ద్ పరిజ్ఞానంతో అసెంబ్లీలోని తెలుగు తల్లిపై సూర్యకిరణాలు పడే విధంగా ఈ డిజైన్ ను సిద్ధం చేసారు.

rajamouli


రోజూ ఉదయం సరిగ్గా 9.15 గంటలకు అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోని తెలుగుతల్లి విగ్రహం పాదాలను సూర్య కిరణాలు తాకేవిధంగా ప్లాన్ డిజైన్ చేశారు. సూర్య కిరణాలు తెలుగు తల్లివిగ్రహాన్ని తాకగానే ‘మా తెలుగుతల్లికి’ పాట రావడం, ఆ తర్వాత అసెంబ్లీ భవనంలో వెలుగులు విరబూయడం.. విజువలైజేషన్‌‌లో కట్టిపడేశాయి. ఈ వీడియోను రాజమౌళి తన ట్విటర్‌ అకౌంట్ ద్వారా బయటపెట్టారు. 


ఈ నేపధ్యంలో అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించటం చూసిన వారంతా రాజమౌళి ముందే ఇలాంటి ఆలోచన చేసారని మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు. కొందరైతే ఈ ఆలోచన చూసే అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించే ఆలోచన చేసారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 


అయితే ఇంతకు ముందే ఇలాంటి ఆలోచనలతో మరిన్ని కట్టడాలు మనవాళ్లు రూపిందించారు. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏడాదికి రెండు సార్లు స్వామివారి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకే విషయం తెలిసిందే. అదేవిధంగా 2 వేల ఏళ్లుగా గుడిమల్లం పరుశురామ ఆలయం, పుదుచ్చేరిలోని మాద్రి మందిర్‌లో జరుగుతోంది. దీని ఆధారంగా దర్శకధీరుడు తన కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. గుజరాత్ లోని మొధేరా సూర్య దేవాలయంలో ఏడాదికి రెండుసార్లు సూర్యకిరణాలు ఆలయంలోకి ప్రవేశించి సూర్యదేవుని విగ్రహంపై పడతాయి. ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయంలో సూర్యోదయ సమయంలో ఆలయంలో సూర్య కిరణాలు పడతాయి.
 


తమిళనాడులోని సూర్యనార్ కోవిల్ టెంపుల్ ను 11-12వ శతాబ్దంలో నిర్మించారు. ఇది సూర్యునికి అంకితం చేయబడిన ఆలయం. కొన్ని ప్రత్యేక సమయాల్లో సూర్యకాంతి సూర్యనార్ విగ్రహం పై పడేలా ఏర్పాటు చేశారు. గుజరాత్ లోని కోబా జైన దేవాలయంలో ఏటా సూర్యాభిషేకం జరుగుతుంది. సూర్యకిరణాలు నేరుగా మహావీరస్వామి పాలరాతి విగ్రహం నుదుటిపై మధ్యాహ్నం 2.07 గంటల నుంచి మూడు నిమిషాలు పడతాయి. మధ్యప్రదేశ్ లోని ఉనవ్ బాలాజీ సూర్య దేవాలయంలో తెల్లవారుజామున సూర్యుని మొదటి కిరణాలు నేరుగా ఆలయ గర్భగుడిలో ఉన్న విగ్రహంపై పడతాయి.
 

click me!