బి గోపాల్ దర్శకత్వంలో బాలయ్య రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఒక్క పలనాటి బ్రహ్మనాయుడు తప్ప మిగిలినవన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో ఆ స్థాయిలో దారుణమైన విమర్శలు పలనాటి బ్రహ్మనాయుడు చిత్రానికి వచ్చాయి.