దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి జీవితంలో వివాదాలు, ఫ్యామిలీ వివరాలు.. ఒంటరిగా ఎందుకు ఉంటున్నాడు?

Published : Jun 11, 2025, 04:28 PM IST

దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీ విషయాలు, వివాదాలు బయటకు వచ్చాయి. 

PREV
17
దర్శకుడు రవికుమార్‌ చౌదరి కన్నుమూత

దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సందర్బంగా దర్శకుడు రవికుమార్‌ లైఫ్‌లో వివాదాలు, వారి ఫ్యామిలీ వివరాలు తెలుసుకుందాం.

27
దర్శకుడు సాగర్‌ వద్ద అసిస్టెంట్‌గా రవికుమార్‌ చౌదరి

దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి గుంటూరులో జన్మించారు. తాను కాలేజీలో చదువుకునే సమయంలో ఐపీఎస్‌ కావాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఓ రోజు తాను చదువుకునే కాలేజీకి ఓ సినిమా సెలబ్రిటీ వచ్చారట. ఆయనకోసం స్టూడెంట్స్ అంతా ఎగబడ్డారట. 

దీంతో తన మనసు మార్చుకుని హైదరాబాద్‌ కి వచ్చాడు. సినిమాల్లో రాణించాలనుకున్నాడు.  దర్శకుడిగా మారిపోయాడు. దర్శకుడు సాగర్‌ వద్ద అసిస్టెంట్‌గా చాలా ఏళ్లు పనిచేశారు. ఆయన  ఒక గాడ్‌ ఫాదర్‌లాగా వ్వవహరించారు.

37
`పిల్లా నువ్వు లేని జీవితం` సినిమాకి నంది అవార్డు

అట్నుంచి దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. `యజ్ఞం` సినిమాతో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. ఆ తర్వాత ఏకంగా బాలయ్యతోనే `వీరభద్ర` చిత్రాన్ని, అలాగే  గోపీచంద్‌తో `సౌక్యం`, సాయి ధరమ్‌ తేజ్‌తో `పిల్లా నువ్వులేని జీవితం`, నితిన్‌ `ఆటాడిస్తా`, `ఏం పిల్లో ఏం పిల్లడో`, `తిరగబడరా సామీ` వంటి చిత్రాలను రూపొందించారు. 

కానీ ఆయనకు సక్సెస్‌ లేదు. `యజ్ఞం`, `పిల్లా నువ్వు లేని జీవితం` మాత్రమే విజయం సాధించాయి. `పిల్లా నువ్వు లేని జీవితం` చిత్రానికి నంది అవార్డు కూడా అందుకున్నారు. కానీ ఆ తర్వాత దర్శకుడిగా ఆయన తీసిన చిత్రాలు ఆడలేదు.

47
దర్శకుడికి దూరంగా ఉంటున్న భార్య

అదే సమయంలో ఫ్యామిలీలోనూ వివాదాలు నెలకొన్నాయి. ఆయనకు నాగ బింధుతో వివాహం జరిగింది. వీరికి రుగ్వేద అనే కూతురు కూడా ఉంది.  ఫ్యామిలీలో వివాదాలు నెలకొన్నాయి. భార్యతో చాలా గొడవలు జరిగాయట. ఆ తర్వాత విడిపోయినట్టు తెలుస్తుంది. అయితే కూతురు బాగోగులు తనే చూసుకుంటున్నాడని తెలుస్తుంది. కానీ చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నాడు రవికుమార్ చౌదరి.

57
`తిరగబడరా సామీ` ఈవెంట్‌లో హీరోయిన్‌కి ముద్దు

మరోవైపు `తిరగబడరా సామీ` మూవీ సమయంలో వివాదంలో ఇరుక్కున్నాడు దర్శకుడు. ఆయన స్టేజ్‌ మీద హీరోయిన్‌కి ముద్దు పెట్టాడు. ఇది పెద్ద రచ్చ అయ్యింది. ఆ తర్వా తన ఉద్దేశ్యం తప్పు కాదని, స్నేహంతోనే, మంచి రిలేషన్‌తోనే అలా ప్రవర్తించానని, తప్పుడు ఉద్దేశ్యంతో ఆ పని చేయలేదని తెలిపాడు.

67
`వీరభద్ర` సినిమా షూటింగ్‌లో వివాదం

అంతేకాదు బాలయ్యతో చేసిన `వీరభద్ర` సినిమా సమయంలోనూ వివాదం నెలకొంది. ఆ చిత్ర నిర్మాత అంబికా కృష్ణ.. రవికుమార్‌ చౌదరిపై ఆ మధ్య షాకింగ్‌ కామెంట్స్ చేశారు. తనకు చెప్పిన కథ ఒకటి, తీసిన కథ ఒకటి అని, బడ్జెట్‌ బాగా పెంచాడని, ఇష్టం వచ్చినట్టు మూవీ తీశాడని, తాగి షూటింగ్‌కి వచ్చేవాడని, బాలకృష్ణ తిట్టినా మారలేదని, షూటింగ్‌లోనే బాలయ్య తిట్టాడని, అయినా ఆయనలో మార్పు రాలేదని, సినిమా ఫెయిల్యూర్‌కి ఆయనే కారణమంటూ విమర్శలు చేశారు. 

77
అంబికా కృష్ణపై రవికుమార్‌ చౌదరి ఫైర్‌

దీనికి ఆ తర్వాత రవికుమార్‌ చౌదరీ కూడా కౌంటర్‌ ఇచ్చారు. తాగి వస్తే అంత మంది హీరోలు తనతో ఎందుకుసినిమాలు చేస్తారని, ఇలా మాట్లాడితే తనలోని గుంటూరోడు బయటకు వస్తాడని తెలిపారు రవికుమార్‌ చౌదరి. ఇలా పలు వివాదాలు రవికుమార్‌ చౌదరి జీవితంలో ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories