మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ విషయంలో ఒక హీరోయిన్ తో చాలా ఇబ్బంది పడ్డారట. చివరికి ఆమెకి వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో కలిసి నటించారు. విజయశాంతి, రాధా, రాధిక, శ్రీదేవి లాంటి హీరోయిన్లతో చిరంజీవి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. భానుప్రియ తో కూడా చిరంజీవి కొన్ని చిత్రాల్లో నటించారు. ఖైదీ నెంబర్ 786, జేబు దొంగ, త్రినేత్రుడు లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి భానుప్రియ గురించి చెప్పిన విషయాలు అందరిని షాక్ గురిచేస్తున్నాయి.
25
ఆమెతో డ్యాన్స్ చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అయిన చిరు
చిరంజీవి మాట్లాడుతూ రాధా, రాధిక లాంటి హీరోయిన్లతో నేను నటించినప్పుడు అభిమానులు మా కాంబినేషన్స్ ని మళ్ళీ మళ్ళీ కోరుకునేవారు. ఎందుకంటే మా మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే భానుప్రియ తో మాత్రం నటించేటప్పుడు చిరంజీవి ప్రారంభంలో ఇబ్బంది పడ్డారట. ముఖ్యంగా ఆమెతో కలిసి సాంగ్స్ లో డాన్స్ చేసేటప్పుడు చిరంజీవి చాలా సౌకర్యానికి గురైనట్లు తెలిపారు.
35
అద్భుతమైన క్లాసిక్ డ్యాన్సర్
ఇండియాలో అద్భుతమైన క్లాసిక్ డాన్సర్స్ లో భానుప్రియ ఒకరు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అంతటి అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ మన తెలుగమ్మాయి కావడం మనకి గర్వకారణం. ఆమెతో కలసి నటించేటప్పుడు ఆ విషయంలో నేను ఎంతో గర్వించే వాడిని. కానీ భానుప్రియ నాతో డాన్స్ చేస్తున్నప్పుడు నేను కూడా డాన్సర్ నే కదా అని ఫీలింగ్ తో ఉండేది. నన్ను మించి డాన్స్ చేయాలనే ఉద్దేశంతో పోటీపడేది.
మేమిద్దరం డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె మా ఇద్దరికీ డాన్స్ కాంపిటీషన్ జరుగుతున్నట్లు ఫీలయ్యేది. కానీ వాస్తవానికి మేమిద్దరం సినిమాలో నటిస్తున్నాం. అది డాన్స్ కాంపిటీషన్ కాదు. ఆమె పోటీతత్వం వల్ల మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్సయ్యేది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మిస్ అయితే సినిమాకి నష్టం. అందుకే ఒకసారి భానుప్రియ దగ్గరికి వెళ్లి దీని గురించి మాట్లాడాను. భాను.. నీకన్నా గొప్ప డాన్సర్ ని కాదు నేను. నువ్వు అద్భుతమైన డాన్సర్ వి. కానీ ఇక్కడ మనిద్దరి మధ్య డాన్స్ కాంపిటీషన్ జరగడం లేదు.
55
చిరంజీవి వార్నింగ్ తో వెనక్కి తగ్గినా భానుప్రియ
నీకు నాతో పోటీపడి డాన్స్ చేయాలనే ఉద్దేశంతో ఉండడం వల్ల సాంగ్ లో కెమిస్ట్రీ మెకానికల్ గా అనిపిస్తోంది. ఈ సాంగ్ ని చూస్తున్న ఆడియన్స్ కి డ్యాన్స్ కాంపిటీషన్ అనిపించకూడదు. మన జంట ఆడియన్స్ కి చూడముచ్చటగా అనిపించాలి అని సుతిమెత్తగా చురకలంటించారు. అప్పటి నుంచి భానుప్రియ చిరంజీవితో పాటకి తగ్గట్టుగా డాన్స్ చేయడం ప్రారంభించింది అని చిరంజీవి గుర్తు చేశారు. ఖైదీ నెంబర్ 789 చిత్రంలో గువ్వా గోరింకతో అనే పాట.. క్లాసిక్ సాంగ్ గా ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది.