ఇప్పుడు హగ్గులు, కిస్సులే మంచి సంస్కృతి అనుకుంటున్నారు.. కృతి సనన్ పై రామాయణం నటి విమర్శలు

Published : Jun 09, 2023, 02:02 PM IST

ఏ ముహూర్తాన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం మొదలైందో కానీ.. మొదటి నుంచి వివాదాల్లో ఈ చిత్రం నలిగిపోతోంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ భక్తి పేరుతో ప్రమోషనల్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

PREV
16
ఇప్పుడు హగ్గులు, కిస్సులే మంచి సంస్కృతి అనుకుంటున్నారు.. కృతి సనన్ పై రామాయణం నటి విమర్శలు

ఏ ముహూర్తాన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం మొదలైందో కానీ.. మొదటి నుంచి వివాదాల్లో ఈ చిత్రం నలిగిపోతోంది. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ భక్తి పేరుతో ప్రమోషనల్ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తొలి టీజర్ విడుదలైనప్పుడే.. ప్రభాస్ గెటప్, గ్రాఫిక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. 

26

కానీ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ తో పరిస్థితి కాస్త మెరుగుపడి మంచి బజ్ వచ్చింది. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు తారా స్థాయికి చేరాయి. కానీ దర్శకుడు ఓం రౌత్, కృతి సనన్ తిరుమల కొండపై హగ్గులు కిస్సుల వ్యవహారంతో ఆదిపురుష్ పై పాజిటివ్ బజ్ కాస్త పూర్తి నెగిటివ్ గా మారింది. వీరి వ్యవహారంతో నలువైపుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 

36

తిరుపతిలో కృతి సనన్, ఓం రౌత్ పై కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనపై నటి దీపికా చిఖిల తీవ్ర విమర్శలు చేశారు. 90వ దశకంలో దేశం మొత్తం విశేష ఆదరణ పొందిన రామానంద్ సాగర్ రామాయణం సీరియల్ లో దీపికా చిఖిల సీత పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ లో అద్భుతంగా నటించిన ఆమె దేశవ్యాప్తంగా గౌరవ మర్యాదలు సొంతం చేసుకున్నారు. 

46

తిరుమలలో కృతి సనన్, ఓం రౌత్ ఘటనపై దీపికా స్పందిస్తూ.. ఈ జనరేషన్ నటీనటులతో ఇదే పెద్ద సమస్య. వాళ్ళకి తాము ఎలాంటి పాత్రలో నటిస్తున్నాం అనే కనీస అవగాహన కూడా ఉండదు. సీత లాంటి పాత్ర చేస్తున్నప్పుడు ఎంతలా లీనం అయిపోవాలి అనేది తెలియదు. అలాంటి వాళ్ళు సీత పాత్రలో నటిస్తే దానిని వాళ్ళు జస్ట్ ఒక పాత్రగానే.. రామాయణాన్ని కేవలం సినిమాగానే చూస్తారు. ఆ పాత్రపై వారికి ఎలాంటి ఎమోషన్ ఉండదు. షూటింగ్ అయిపోగానే ఒక ప్రాజెక్టు అయిపోయింది అని భావిస్తారు. కృతి సనన్ కూడా ఈ జనరేషన్ నటి కాబట్టి అలాగే బిహేవ్ చేస్తోంది అని దీపికా చురకలంటించారు. 

56

ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం మాత్రమే ఇప్పుడు మంచి సంస్కృతి అని ఈ తరం నటులు భావిస్తున్నారు. కృతి సనన్ ఆదిపురుష్ లో సీతగా నటిస్తోంది. కానీ ఆమె తనని తాను సీతగా భావించలేకుంది. మా రోజుల్లో అలా కాదు. నేను కూడా సీత పాత్రలో నటించాను కదా. నేను ఆ పాత్రలో జీవించి తరించిపోయా. కనీసం సెట్ లో కూడా మమ్మల్ని పేరు పెట్టి పిలిచేవారు కాదు. 

66

మమ్మల్ని నిజమైన దేవుళ్ళ లాగే భావించే వారు. ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఎంతోమంది మా పాదాలకి నమస్కారం చేసే వారు. దేవుళ్ళే స్వయంగా వచ్చారు అనేంత భక్తి పారవశ్యంతో మమ్మల్ని గౌరవించేవారు. అందుకే మేము కూడా ప్రజలని నొప్పించే విధంగా ఎప్పుడూ నడుచుకోలేదు అని దీపీకా చిఖిల అన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories