యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. లౌక్యం, లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడు. సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.