అదే విధంగా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో నా స్కిన్ కలర్ గురించి చాలా మంది కామెంట్స్ చేశారు. నాది డార్క్ స్కిన్ అని, డస్కీగా ఉంటానని చాలా మంది నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. నా స్కిన్ కలర్ పై కామెంట్స్ చేస్తే నేనేం కుంగిపోలేదు. అప్పుడు స్కిన్ కలర్ పై చాలా పిచ్చి ఉండేది. ఇప్పుడు అది తగ్గుతూ వస్తోంది. నన్ను, నా స్కిన్ కలర్ ని ఇప్పుడు అంతా యాక్సప్ట్ చేస్తున్నారు. డింపుల్ డార్క్ చాక్లెట్ ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుండడంతో హ్యాపీగా అనిపిస్తోంది అని పేర్కొంది.