Dil Raju : గేమ్ ఛేంజర్ విషయంలో పెద్ద తప్పు జరిగింది, పరోక్షంగా శంకర్ పై..దిల్ రాజు కామెంట్స్

Published : Feb 01, 2025, 08:54 PM IST

Dil Raju About Game Changer Flop: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతి సీజన్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో నష్టాలు తప్పలేదు. 

PREV
15
Dil Raju : గేమ్ ఛేంజర్ విషయంలో పెద్ద తప్పు జరిగింది, పరోక్షంగా శంకర్ పై..దిల్ రాజు కామెంట్స్
Dil Raju, Game Changer Movie

Dil Raju About Game Changer Flop:టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతి సీజన్ మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ చిత్రం డిజాస్టర్ కావడంతో నష్టాలు తప్పలేదు. కానీ వెంకటేష్ తో నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తుతూ దాదాపు 250 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

25
Ram Charan

అత్యధిక లాభాలు రావడంతో దిల్ రాజు తో పాటు బయ్యర్లు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన గేమ్ ఛేంజర్ మాత్రం ఊహించని విధంగా దెబ్బ కొట్టింది. ఈ చిత్ర రిజల్ట్ విషయంలో దిల్ రాజు ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. 

35

దిల్ రాజు మాట్లాడుతూ.. గత 4 ఏళ్లుగా తాము గుంతల రోడ్డుపై ప్రయాణం చేస్తున్నాం అని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మంచి రోడ్డు ఎక్కేశామని ఆనందం వ్యక్తం చేశారు. గేమ్ ఛేంజర్ చిత్రం విషయంలో తాను చేసిన తప్పుల్ని దిల్ రాజు పరోక్షంగా అంగీకరించారు. పరోక్షంగా శంకర్ కి కూడా కౌంటర్లు వేశారు. 

45
Game Changer

ఏ సినిమాకి అయినా బడ్జెట్ ముఖ్యం కాదు. ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తే సినిమాలు హిట్ కావు అంటూ దిల్ రాజు పరోక్షంగా తెలిపారు. బడ్జెట్ కాదు, కథలే ముఖ్యం. ఇంత చిన్న లాజిక్ ని తాము కోనేళ్ళుగా మిస్ అయినట్లు దిల్ రాజు తెలిపారు. 

55
Director Shankar

గతంలో ఎస్విసీ బ్యానర్ లో అనేక క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. అవన్నీ కథల్ని నమ్ముకుని, దర్శకులతో ట్రావెల్ అయి చేసిన చిత్రాలు. అలా కాదని కాంబినేషన్స్ వెంట పడడం వల్ల తాము ట్రాక్ తప్పినట్లు దిల్ రాజు ఒప్పుకున్నారు. 2025లో చాలా పెద్ద పాఠం నేర్చుకున్నట్లు దిల్ రాజు తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories