పవన్ కళ్యాణ్ ని కలిసిన దిల్ రాజు, దానయ్య ఇతర అగ్ర నిర్మాతలు.. రాజీ కుదుర్చుతున్నారా!

First Published Oct 1, 2021, 2:32 PM IST

దిల్ రాజు, డివివి దానయ్య, మైత్రి సంస్థ నిర్మాత ఇతర అగ్ర నిర్మాతలు నేడు పవన్ కళ్యాణ్ ని ఆయన నివాసంలో కలవడం ఆసక్తిగా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు అటు ఏపీ రాజకీయాల్లో, ఇటు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేదికపై చిత్ర చిత్ర పరిశ్రమ సమస్యలు, తేజు బైక్ యాక్సిడెంట్ విషయాలు ప్రస్తావిస్తూ మీడియా, వైసిపి ప్రభుత్వాన్ని పవన్ ఎండగట్టాడు. అప్పటి నుంచి జనసేన వైసిపి మధ్య వాతావరణం రణరంగంలా మారింది. 

ఈ మొత్తం వ్యవహారం చిత్ర పరిశ్రమకు ఎక్కడ డ్యామేజ్ చేస్తుందేమో అని దిల్ రాజు, దానయ్య సహా ఇతర నిర్మాతలు ఏపీ మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆన్లైన్ టికెటింగ్ విధానంపై చర్చించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ వ్యాఖ్యలపై దిల్ రాజు పరోక్షంగా స్పందించారు. చిత్ర పరిశ్రమ సున్నితమైనది. ఈ విషయాన్ని మీడియా కాంట్రవర్సీ చేయవద్దు అని కోరారు. 

ఆన్లైన్ టికెటింగ్ విధానంపై ప్రభుత్వంలో మరో రెండుసార్లు సమావేశమై చర్చిస్తామని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఆ విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది క్లారిటీ రావాల్సి ఉందని దిల్ రాజు తెలిపారు. 

ఇదిలా ఉండగా దిల్ రాజు, డివివి దానయ్య, మైత్రి సంస్థ నిర్మాత ఇతర అగ్ర నిర్మాతలు నేడు పవన్ కళ్యాణ్ ని ఆయన నివాసంలో కలవడం ఆసక్తిగా మారింది. చిత్ర పరిశ్రమ సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి అనే కోణంలో వీరిమధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

ఏపీ ప్రభుత్వ విధానాలు చిత్ర పరిశ్రమకు ఇబ్బందిగానే ఉన్నాయనేది ఇన్సైడ్ టాక్. కానీ కాంట్రవర్సీల ద్వారా సమస్య మరింత ముదురుతుందేమోనని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. దీనితో రాజీ ప్రయత్నాల్లో భాగంగానే మొదట పేర్ని నానిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని అగ్ర నిర్మాతలు కలిశారు. 

పవన్ ని కలసిన వారిలో దిల్ రాజు, డివివి దానయ్య, మైత్రి సంస్థ నవీన్, బన్నీ వాసు, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్ లు ఉన్నారు. పండుగ సీజన్ దగ్గర పడుతుండడంతో టాలీవుడ్ లో భారీ చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. కాబట్టి త్వరగా ప్రభుత్వం తమ సమస్యలని పరిష్కరించాలని దిల్ రాజు పేర్ని నాని ముందు వ్యాఖ్యానించారు. మరి ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

click me!