రష్మి గౌతమ్‌ లవ్‌ సక్సెస్ అవుతుందా? తెరవెనుక రహస్యాలు బయపటడే సమయం.. షాకిచ్చేలా జబర్దస్త్ యాంకర్ రియాక్షన్‌

Published : Apr 19, 2023, 07:06 PM IST

యాంకర్‌ రష్మి ఇన్నాళ్లు సుడిగాలి సుధీర్‌ ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. కానీ ఇది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. మరోవైపు ఆమెకి సీక్రెట్‌ లవ్ స్టోరీ ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏ ప్రేమ నిజం, ఏది నిజమవుతుందనేది పెద్ద సస్పెన్స్. అయితే ప్రేమని తేల్చుకునే సమయం వచ్చింది.

PREV
15
రష్మి గౌతమ్‌ లవ్‌ సక్సెస్ అవుతుందా? తెరవెనుక రహస్యాలు బయపటడే సమయం.. షాకిచ్చేలా జబర్దస్త్ యాంకర్ రియాక్షన్‌

జబర్దస్త్ యాంకర్‌ రష్మి గౌతమ్‌.. అటు `జబర్దస్త్`కి, ఇటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి యాంకర్‌గా చేస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాణిస్తుంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ అలరిస్తుంది. గ్లామర్‌ బ్యూటీగా ఆకట్టుకుంటుంది. ముద్దుముద్దు మాటలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. అందాల విందు ఇస్తూ కట్టిపడేస్తుంది. అయితే ఈ భామ చాలా కాలంగా జబర్దస్త్ మాజీ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌తో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. స్కిట్లలో వీరు చేసిన యాక్షన్‌, కెమిస్ట్రీ, రొమాన్స్ లు, లవ్‌ ప్రపోజల్స్ ని బట్టి ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని అభిమానులంతా ఫిక్స్ అయ్యారు. 
 

25

స్టేజ్‌పై ఈ ఇద్దరు రింగులు, ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లు చేసుకుని, డ్యూయెట్లు పాడుకున్నారు. అయితే అంతిమంగా తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెబుతున్నారు. మరోవైపు రష్మి.. తెరవెనుక లవ్‌ స్టోరీ ఉందనే ప్రచారం కూడా ఉంది. ఆమె పర్సనల్‌ లైఫ్‌ వేరే అని, ఆ విషయాలు బయటకు రానివ్వరని, పూర్తిగా సీక్రెట్‌గా ఉంచుకుంటారనే టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలో రష్మికి వేరే లవర్‌ ఉన్నాడని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియదు. కానీ తాజాగా రష్మి చేసిన కామెంట్లు మాత్రం.. ఆమెకి తెరవెనుక లవ్‌ స్టోరీ ఉందనే విషయం అర్థమవుతుంది.
 

35

రష్మి తాజాగా `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో తన ప్రేమకి పరీక్ష పెట్టుకుంది. ఓ బాక్స్ లో రాయి వేస్తే అందులో పడాలి. పడితే అనుకున్నది జరుగుతుందని, పడకపోతే లేదనేలా గేమ్‌ పెట్టారు. ఇందులో ప్రముఖ కమెడియన్‌ బ్రహ్మాజీ, బుల్లెట్‌ భాస్కర్‌, అలాగే రష్మి పాల్గొన్నారు. బ్రహ్మాజీ తనదైన కామెడీ పంచితే, బుల్లెట్‌ భాస్కర్‌ చేసిన అతికి ఆయన దొరికిపోయారు. దీంతో బట్టలూడదీసి రచ్చ చేశారు. అనంతరం రష్మి వంతు వచ్చింది. ఆమె కోరుకునే సమయం వచ్చింది. 

45

యాంకర్‌ రష్మి తన ప్రేమని కోరుకుంది. నా లైఫ్‌లో నా లవ్‌ సక్సెస్‌ అవుతుందా? లేదా? రాయి బాక్స్ లో పడితే నా లవ్‌ సక్సెస్‌ అవుతుంది, పడకపోతే కాదు అనేలా రష్మి కామెంట్‌ చేసింది. దీంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. రష్మి రాయి పడుతుందా లేదా? అనేది అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రష్మిలోనూ టెన్షన్‌ ప్రారంభమైంది. ఎట్టకేలకు ఆమె తన రాయిని వేసింది. కానీ అందులో పడిందా లేదా అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ వదిలేశారు. అయితే రష్మి తన రాయి పడలేదన్నట్టుగా నోరెళ్లబెట్టిన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. దీంతో అంతా షాకింగ్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. ఇది ఆద్యంతం ఉత్కంఠతకి గురి చేస్తుంది. 
 

55

ఈటీవీలో ఆదివారం వచ్చే `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో ఇది. ఇందులో రష్మి ఎపిసోడ్‌ హైలైట్‌గా మారితే, బ్రహ్మాజీ కామెడీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆయన కామెడీని అంతా ప్రశంసిస్తున్నారు. ఆయన రాకతో ఎపిసోడ్‌ చూడాలనే ఆసక్తి ఏర్పడిందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇందులో రష్మి లవ్‌ నిజమేనా, లేక టీఆర్‌పీ రేటింగ్‌తో కూడిన స్టంటా అనేది అనుమానంగా ఉంది. మరి నిజమేంటి? రష్మి నిజంగానే ప్రేమలో ఉందా? ఉంటే ఆమె లవ్‌ సక్సెస్‌ అవుతుందా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories