Dhurandhar 30 Days Collections: జవాన్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన ధురంధర్‌.. బాలీవుడ్‌లో నెం 1.. కలెక్షన్లు ఎంతంటే?

Published : Jan 03, 2026, 11:12 PM IST

Dhurandhar 30 Days Collections: బాక్సాఫీస్ వద్ద స్పై యాక్షన్ డ్రామా 'ధురంధర్‌`  30 రోజులు పూర్తి చేసుకుంది.  ఈ 30 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో రూ.800 కోట్లకు పైగా సంపాదించింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. 

PREV
14
బాక్సాఫీసుని షేక్‌ చేస్తోన్న `ధురంధర్‌`

రణ్‌వీర్‌ సింగ్‌, అక్షయ్ ఖన్నా నటించిన `ధురంధర్‌` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. అదిత్య ధార్‌ రూపొందించిన ఈ మూవీ విడుదలై నెల రోజులు అవుతున్నా, బాక్సాఫీసు వద్ద జోరు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ స్టడీగా ఉన్నాయి. ఇప్పటికే అన్ని బాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసిన ఈ మూవీ ఇప్పుడు సరికొత్త సంచలనం దిశగా వెళ్తోంది.  ఇప్పటికీ డబుల్‌ డిజిట్‌ నెంబర్‌ కలెక్షన్లు వస్తుండటం విశేషం. 

24
30 రోజుల్లో 'దురందర్' మొత్తం కలెక్షన్?

`ధురంధర్‌` మూవీ 30 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి 30వ(శనివారం) రోజు కూడా పది కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. రాత్రి 9గంటలకు వరకు ఈ లెక్క. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.  ఇక ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1200కోట్లు దాటింది. ఇండియాలోనే ఈ మూవీ ఏకంగా రూ.800కోట్లు దాటడం విశేషం.  29వ రోజుకి రూ.794కోట్లు రాగా, 30వ రోజుకి రూ.804కోట్లు వసూలు చేసింది.  

34
`జవాన్‌` లైఫ్‌ టైమ్‌ వసూళ్లని బ్రేక్‌ చేసిన `ధురంధర్‌`

`ధురంధర్‌` మూవీ ఇప్పుడు సరికొత్త సంచలనం సృష్టించింది. ఇండియా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ లో అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇది `జవాన్‌` వసూళ్లని బ్రేక్‌ చేసింది. లైఫ్‌ టైమ్‌ వసూళ్లతోపాటు, ఇండియా వసూళ్ల పరంగానూ షారూఖ్‌ ఖాన్‌ `జవాన్‌`ని దాటేసింది `ధురంధర్‌`. ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా `జవాన్‌` నిలిచింది. ఆ రికార్డులను రణ్‌వీర్‌ సింగ్‌ మూవీ బద్దలు కొట్టడం విశేషం. `జవాన్‌` కి ఇండియాలో రూ.761కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.1150కోట్లు వచ్చాయి. 

44
ఇండియాలో హైయ్యెస్ట్ కలెక్ట్ చేసిన నాల్గో మూవీ `ధురంధర్‌`

బాలీవుడ్‌ సినిమాల అన్ని రికార్డులను బ్రేక్‌ చేసిన `ధురంధర్‌` ఇప్పుడు ఇండియా వైడ్‌గా అన్ని భాషల చిత్రాలతో పోల్చితే అత్యధిక వసూళ్లని రాబట్టిన నాల్గో మూవీగా నిలిచింది.  ఇండియాలో అత్యధిక కలెక్షన్లని సాధించిన చిత్రాలుగా `బాహుబలి 2`, `పుష్ప 2`, `కేజీఎఫ్‌ 2` ఉన్నాయి.  వీటి తర్వాత నాల్గో స్థానంలో ఇప్పుడు `ధురంధర్‌` చేరింది. మున్ముందు ఇది `కేజీఎఫ్‌` రికార్డులు కూడా బ్రేక్‌ చేసే ఛాన్స్ ఉంది. మరి ఇంతటి సంచలనంగా మారిన ఈ మూవీ కేవలం రూ.225 కోట్ల బడ్జెట్‌తో రూపొందడం విశేషం.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories