నటి ప్రీతి జింటా సినిమా చూశాక తన X ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు, "ఇప్పుడే ధురంధర్ 2 చూశాను, ఒక్కటే మాట—పగ తీర్చుకుంటే ధురంధర్ లా ఉండాలి, లేదంటే వద్దు! డైరెక్షన్, యాక్టింగ్, మ్యూజిక్, ఎడిటింగ్, స్టోరీ—ప్రతి విభాగం అద్భుతం. సినిమా ఎంతగా నచ్చిందంటే మళ్లీ థియేటర్‌లో చూడాలనిపిస్తోంది.
ఆదిత్య ధర్ అద్భుతమైన పనితనం కనబరిచారు. ప్రేక్షకులను లీనం చేసే అనుభూతినిచ్చారు. రణ్‌వీర్ సింగ్ నటన మనసు దోచుకుంటుంది—రేంజ్, డెప్త్, ఎమోషన్ అన్నీ టాప్ లెవల్‌లో ఉన్నాయి అని రాశారు.
ఆర్. మాధవన్‌తో పాటు మొత్తం స్టార్‌కాస్ట్ అదరగొట్టింది. సంజయ్ దత్ స్వాగ్, అర్జున్ రాంపాల్ స్టైల్, మిగతా నటీనటుల నటన అద్భుతం. మొత్తంగా, ఇది ఒక పవర్‌ఫుల్, గుర్తుండిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్—అస్సలు మిస్ అవ్వకండి!"