రణ్‌వీర్ సింగ్ నటించిన `ధురంధర్ 2` మూవీ ఇంకా బాక్సాఫీసు వద్ద జోరు చూపిస్తోంది. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లని సంపాదిస్తుంది. 28 రోజుల తర్వాత 'ధురంధర్ 2' భారతదేశంలో సుమారు రూ.1,096.70 కోట్ల నెట్ కలెక్షన్‌ను సాధించింది. ఈ వసూళ్లు సినిమా అన్ని వెర్షన్లను (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) కలుపుకొని వచ్చినవి. 28వ రోజు ఫైనల్ లెక్కలు వచ్చాక, ఈ సినిమా ఇండియాలో రూ.1100 కోట్ల నెట్ మార్క్‌ను దాటుతుందని అంచనా వేస్తున్నారు.