రాజమౌళి నిర్ణయం వల్ల.. ఓ యంగ్ హీరో చేసిన పనికి అనుష్క శెట్టి కన్నీళ్లు పెట్టిన విషయం మీకు తెలుసా? బాహుబలి సినిమా టైమ్ లో స్టార్ హీరోయిన్ మనసు బాధపడిన సందర్భం ఏంటంటే?
టాలీవుడ్ జేజమ్మ అనుష్క.. స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ.. అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలతో తిరుగులేని ఇమేజ్ ను సాధించింది. ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున, సూర్య, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ.. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలతో దుమ్మురేపింది. స్టార్ హీరోలను మించి ఇమేజ్ ను సాధించిన అనుష్క.. భారీగా రెమ్యునరేషన్ కూడా అందుకుంది. ప్రస్తుతం సినిమాలు తగ్గించి.. అడపా దడపా మాత్రమే కనిపిస్తోంది.
27
అనుష్క శెట్టి కన్నీళ్లు పెట్టిన సందర్భం..
అనుష్క శెట్టి నటించిన భారీ సినిమాల్లో బాహుబలి కూడా ఒకటి. ఈ సినిమా టైమ్ లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే? బాహుబలి టైమ్ లో రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్ల.. ఓ యంగ్ హీరో చేసిన పనికి అనుష్క శెట్టికి గాయం తగిలి బాధపడిందట. కన్నీళ్లు వచ్చేంతగా అనుష్క ఫీల్ అయ్యిందట. ఆ యంగ్ హీరో ఎవరో కాదు అడివి శేష్. ఈ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా వెల్లడించారు.
37
నాలుగేళ్లుగా..ఒక్క సినిమా కూడా చేయని హీరో..
విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ యూత్ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించిన హీరోల్లో అడివి శేష్ ఒకరు. ఉరుకుటు పరుగులు పెడుతూ.. ఎక్కువ సినిమాలు చేయడం కంటే, నిదానంగా మంచి కంటెంట్‌తో సినిమాలు చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు.
ఇప్పుడు ఆయన హీరోగా నటించిన డెకాయిట్ ఒక ప్రేమ కథ చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో అడివి శేష్ మీడియాతో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
57
బాహుబలి సినిమా షూటింగ్ లో జరిగిన సంఘటన
ఈ సందర్భంగా ఆయన బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు. ఆ చిత్రంలో అనుష్క శెట్టి తో కలిసి పనిచేసిన అనుభవాన్ని వివరించారు.అడివి శేష్ మాట్లాడుతూ, “అనుష్కను అందరూ ‘స్వీటీ’ అని పిలుస్తుంటారు.
ఆమె వ్యక్తిత్వాన్ని చూసే ఆ పేరు పెట్టారని నాకు అనిపిస్తుంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి. బాహుబలి సినిమాలో ఒక సన్నివేశంలో ఆమె ఖైదీగా ఉండగా, నేను కట్టెలతో కొట్టి నిద్రలేపే సీన్ ఉంది. ఆ సీన్ షూటింగ్ పూర్తయ్యాక ఆమెకు గట్టిగా ఏదైనా తగిలిందేమో అని నేను అడిగాను,”
67
అనుష్కను కాలితో తన్నిన హీరో..
అంతకు ముందు జరిగిన మరో సన్నివేశాన్ని కూడా ఆయన వివరించారు. “ఒక షాట్‌లో నేను నా కాలితో అనుష్కను గట్టిగా తన్నాలి ఉంటుంది. మొదట నేను సున్నితంగానే చేశాను. కానీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అది సరిపోదని చెప్పడంతో గట్టిగా చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అనుష్కకు మెడ దగ్గర గాయమైంది. ఆమెకు నొప్పి ఎక్కువగా ఉండి, కళ్లలో నీళ్లు కూడా వచ్చాయి,” అని తెలిపారు.
77
బాహుబలిలో భద్రుగిగా అడవి శేష్..
అడవి శేష్ మాట్లాడుతూ, “ఆ సంఘటన తర్వాతనే నేను ఆమెతో మొదటిసారి మాట్లాడాను,” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తున్నాయి.బాహుబలి చిత్రంలో భల్లాలదేవ కుమారుడిగా భద్రుడి పాత్రలో అడివి శేష్ నటించారు. ఆ చిత్రంలో ఆయన నెగెటివ్ పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా మారి, వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారు.