పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదన్న `ఢీ` వర్షిణి.. హైపర్‌ ఆది మొఖం మాడిపోయింది.. బిగ్‌బాస్‌ అభిజిత్‌ నుంచి వార్నింగ్‌

First Published Jan 22, 2021, 2:12 PM IST

బుల్లితెరపై యాంకర్‌ రష్మీ గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌ మధ్య మంచి కెమిస్ట్రీ రన్‌ అవుతుంది. దీనికి పారలల్‌గా హైపర్‌ ఆదికి, `ఢీ` వర్షిణికి కూడా మరో కెమిస్ట్రీ జరుగుతుంది. వర్షిణిని పడేయడానికి ఆది చాలా కాలంగా పులిహోర కలుపుతూనే ఉన్నాడు. కానీ తాజాగా వర్షిణి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో హైపర్‌ ఆది ముఖం వాడిపోయినంత పనైంది. ఈ విషయంలో `బిగ్‌బాస్‌ 4` విన్నర్‌ అభిజిత్‌ కూడా వార్నింగ్‌ ఇచ్చారని టాక్‌. 

ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ ఛాంపియన్‌` షోలో హైపర్‌ ఆది, వర్షిణి మధ్య చాలా రోజులుగా మంచి కెమిస్ట్రీ నడుస్తుంది. ఒకరిపై ఒకరు బాగానే పంచ్‌లు వేసుకుంటున్నారు. కొన్నిసార్లు అవి శృతి మించిన పంచ్‌లుగా కూడా ఉండటం విశేషం.
undefined
దీంతో ఫ్యాన్స్, ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చారు. `జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్‌కి, యాంకర్‌ రష్మికి మధ్య కెమిస్ట్రీతోపాటు లవ్‌ ఎఫైర్‌ నడుస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు ఇటీవల వీరిద్దరు పెళ్ళి చేసుకోవాలనే ఒత్తిడి కూడా నెటిజన్ల నుంచి వినిపిస్తుంది.
undefined
దాన్ని ప్రభావం తగ్గించేందుకు షో నిర్వాహకులు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో హైపర్‌ ఆది, వర్షిణి మధ్య ఎఫైర్‌ని హైలైట్‌ చేస్తున్నారు. వారికి దీటుగా వీరిని బిల్డప్‌ చేస్తున్నారు.
undefined
అదే సమయంలో చాలా పర్సనల్‌గా తీసుకున్న ఆది.. వర్షిణిని తన బుట్టలో పడేసేందుకు సిన్సియర్‌గానే ప్రయత్నిస్తున్నారు. అందుకు వర్షిణి కూడా బాగానే సహకరిస్తుంది. అయితే ఈ విషయంలో వర్షిణి ప్రయత్నం కేవలం షోకే పరిమితమయ్యేలా ఉంది.
undefined
ఎందుకంటే వర్షిణి కోసం ఆది ప్రతి షోలో పులిహోర కలపడం, ఆమెపై పంచ్‌లు వేయడం, లవ్‌, పెళ్లికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా వ్యవహరించడం, వర్షిణిని చూపిస్తూ మాట్లాడటం వంటివి చేస్తున్నాడు. కానీ వర్షిణి వాటిని లైట్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
undefined
ఇటీవల ఈటీవీలో ప్రసారం అయ్యే `అలీతో సరదాగా` షోలో వర్షిణి, హైపర్‌ ఆది పాల్గొన్నారు. ఎప్పటిలాగే వర్షిణి విషయంలో ఆది పులిహోర కలపడం స్టార్ట్ చేశారు. ఆ విషయం అలీ కూడా బహిరంగంగానే అడిగారు. ఈ సందర్భంగా వర్షిణి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
undefined
ఐదేళ్ల క్రితమే లవ్‌ స్టోరీ సాగిందని, లవ్‌ బ్రేకప్‌ అయ్యిందని తెలిపింది. అతని వివరాలు చెప్పని వర్షిణి.. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందట. దీంతో పెళ్లిపై నమ్మకం పోయిందని చెప్పింది. పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. దీంతో హైపర్‌ ఆదికి ముఖం వాడిపోయినంత పనైంది. అప్పటి వరకు వరకు పులిహోర కలిపి ఆది.. వర్షిణి స్టేట్‌మెంట్‌కి మతిపోయినంత పనైంది.
undefined
మాలాంటి మంచి వాళ్లు కూడా ఉంటారని, కొంచెం చూడాలని పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు. అయితే హైపర్‌ ఆది `ఢీ` ద్వారా పరిచయం అయ్యారని, ఇప్పుడు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని తేల్చిపడేసింది. దీంతో ఆదికి మరింతగా చెప్పదెబ్బ పడినంత పనైంది.
undefined
అంతేకాదు ఇటీవల `బిగ్‌బాస్‌4` విన్నర్‌ అభిజిత్‌ నుంచి కూడా ఆదికి వార్నింగ్‌ వెళ్లినట్టు తెలుస్తుంది. వర్షిణి, అభిజిత్‌ `పెళ్లి గోల` అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. వీరిద్దరు ఆ సమయంలో చాలా చనువుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ పూర్తయిన తర్వాత అభిజిత్‌, వర్షిణి మళ్లీ దగ్గరవుతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అభిజిత్‌.. ఆదికి వార్నింగ్‌ ఇచ్చారని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
undefined
`జబర్దస్త్` షో ద్వారా పాపులర్‌ అయ్యారు హైపర్‌ ఆది. యాసలు, ప్రాసలతో కూడిన పంచ్‌లు బాగా పేలాయి. దీంతో ఆయన అనతి కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ షో అనేక అవకాశాలు తెచ్చిపెట్టింది. `ఢీ`తోపాటు పలు ఇతర షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ కామెడీ పండిస్తున్నారు.
undefined
మరోవైపు మోడలింగ్‌ నుంచి టీవీ పరిశ్రమలోకి వచ్చిన లఘు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు చేస్తూ వచ్చింది. నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గానూ నటించింది. `పెళ్లిగోల` వెబ్‌ సిరీస్‌ మంచి పేరు తెచ్చిపెట్టింది. `ఢీ` లో టీమ్‌ లీడర్‌గా ఛాన్స్ రావడంతో వర్షిణి కెరీరే మారిపోయింది.
undefined
click me!