గ్లామర్ పరంగా ప్రగ్యా జైస్వాల్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ ఆమె సొంతం. ఇటీవల ప్రగ్యా జైశ్వాల్ సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తోంది. కుర్రకారు చూపు తిప్పుకోలేని విధంగా అందాలు ఆరబోస్తోంది.
కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన Pragya Jaiswal ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైశ్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో Balakrishna సరసన Akhanda చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కనుక హిట్ అయితే ప్రగ్యా కెరీర్ బూస్టప్ అయినట్లే. ప్రగ్యా కు సక్సెస్ రేట్ తక్కువ. అందుకే ఈ అందాల భామ రేసులో వెనుకబడింది.
రీసెంట్ గా ప్రగ్యా జైస్వాల్ కరోనా బారీన పడింది. ప్రగ్యా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీనితో అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ప్రగ్యా బాలయ్య సరసన అఖండ చిత్రంలో నటిస్తుండడంతో కరోనా టెన్షన్ నందమూరి అభిమానులకు కూడా పెరిగింది. వారం క్రితం తనకు కోవిడ్ పాజిటివ్ గా తేలినట్లు ప్రగ్యా తెలిపింది. ప్రగ్యా కరోనా బారీన పడడం ఇది రెండవసారి.
అయితే తాజాగా ప్రగ్యా జైస్వాల్ కరోనా నుంచి కోలుకుంది. Covid టెస్టులో నెగిటివ్ అని తేలినట్లు ప్రగ్యా చెప్పుకొచ్చింది. 'నెగిటివ్.. ఇంతకు ముందెప్పుడూ ఈ మాట నన్ను సంతోషపెట్టలేదు' అంటూ కామెంట్ పెట్టింది. ఈ గుడ్ న్యూస్ తెలియజేస్తూ ప్రగ్యా కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేలా హాట్ ఫోటోస్ షేర్ చేసింది.
థైస్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ ప్రగ్యా ఇచ్చిన ఫోజులు మతిపోగోట్టే విధంగా ఉన్నాయి. చాలా కురచగా ఉండే వైట్ డ్రెస్ లో ప్రగ్యా థైస్ అందాలు కనువిందు చేస్తున్నాయి.