సుడిగాలి సుధీర్‌ అసలు రంగు బయటపెట్టిన `ఢీ` భామ దీపికా పిల్లి.. షాకైన యాంకర్‌ రష్మి..

Published : Aug 21, 2021, 02:23 PM ISTUpdated : Aug 21, 2021, 03:20 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. సుడిగాలి సుధీర్‌ని పట్టుకుని స్టేజ్‌పైనే పరువు తీసేసింది. అందరి ముంది ఆయన అసలు రంగు బయటపెట్టింది. ఈ విషయం తెలిసి  ఖంగు తినడం యాంకర్‌ రష్మి వంతయ్యింది. ఇంతకి ఏం జరిగిందంటే.

PREV
19
సుడిగాలి సుధీర్‌ అసలు రంగు బయటపెట్టిన `ఢీ` భామ దీపికా పిల్లి.. షాకైన యాంకర్‌ రష్మి..

`ఢీ`లో సుడిగాలి సుధీర్‌ బండారం బయటపెట్టింది దీపికా పిల్లి. ఆయన ఊర్లో వేసే వేషాలను నిర్మోహమాటంగా చెప్పింది. చెప్పమీద కొట్టినట్టు చెప్పి షాకిచ్చింది. `ఢీ` షో మొత్తం అవాక్కయ్యేలా చేసింది. 

29

ఇందులో సుడిగాలి సుధీర్‌ ఊరు ప్రెసిడెంట్‌. హైపర్ ఆది ఆయన అసిస్టెంట్. అలా ఊరు తిరిగొద్దామని వెళ్తారు. వీళ్లకి ఊరికి కొత్తగా వచ్చిన యాంకర్‌ ప్రదీప్‌ జంట కనిపిస్తుంది.

39

ఊర్లో ఉందామని వచ్చామయ్యా, కాస్త ఇళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్తారా? అని అడగ్గా. ఊరు చివరన ఉన్న ఇంట్లో ఉండండి అని చెబుతాడు హైపర్‌ ఆది.

49

ఊరు చివరన ఎందుకని ప్రదీప్‌ ప్రశ్నించగా, మా ప్రెసిడెంట్‌ గారు కాలక్షేపానికి ఊరు చివరకే ఎక్కువగా వస్తుంటారని చెబుతాడు ఆది. అప్పుడు ఊరు చూపించండి సర్‌ అనగా, ఊరు చివరగా గడ్డి వాము ఉంటుందని చెప్పారు సుధీర్‌. అక్కడేం ఉంటుందని ప్రశ్నించగా సుధీర్‌ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయించింది. 

59

ఇంతలో హాఫ్‌ శారీలో హోయలు పోతూ దీపికా పిల్లి, రష్మీ వచ్చారు. మీరెవరండి ఊర్లో కొత్తగా కనిపిస్తున్నారని రష్మీ అడగ్గా, ఊరికి కొత్తా, ఊర్లో ఉందామని వచ్చామని ప్రదీప్‌ చెప్పారు. 

69

అంతే మరో మాట లేకుండా మా ఇంటికి వస్తారా? అని దీపికా పిల్లి వయ్యారాలు పోతూ అడిగింది. అయ్యో భలేవారండి, వస్తామని చెప్పాడు ప్రదీప్‌. సర్‌ మాకు ఇళ్లు దొరికేసిందని సుధీరోతో చెప్పారు ప్రదీప్‌.

79

దీనికి హర్ట్ అయిన సుధీర్‌..ఇప్పటి వరకు తనని అడిగారా `మా ఇంటికి వస్తారా` అని అంటూ దీపికాని ప్రశ్నించాడు. దీనికి దీపికా పిల్లి స్పందిస్తూ, మిమ్మల్ని అడగకపోయినా వస్తారు కదా అండి! అని బోల్డ్ గా చెప్పేసింది. సుధీర్‌ అసలు రంగు బయటపెట్టేసింది.

89

దీంతో యాంకర్‌ రష్మి ఖంగుతిన్నది. దీపికా మాటలకు షాక్‌ అయిన ఆమె `అమ్మో... ` అంటూ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్‌గా మారింది. ఆద్యంతం నవ్వులు పూయించింది. ఇది `ఢీ` షో నెక్ట్స్ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలోని సుధీర్‌, ఆది, దీపికా పిల్లి, రష్మిల కామెడీ స్కిట్‌. ఆద్యంతం నవ్వులు పూయించింది. 

99

ఈ సారి విలేజ్‌ స్పెషల్‌ అంటూ స్కిట్‌ని ప్రదర్శించారు. ఇందులో ప్రియమణి, పూర్ణ, రష్మి, దీపికా పిల్లి హాఫ్‌ శారీలో, చీరకట్టులో పల్లెటూరి మహిళల్లా ముస్తాబై కనిపించారు. ఆకట్టుకుంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories