ఎపిసోడ్ ప్రారంభంలో నువ్వు నిజం నిరూపించుకునే సమయం చాలా తక్కువ ఉంది ముందు దాని గురించి ఆలోచించు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా అంటాడు రాజ్. ఇంట్లోంచి పంపించేస్తారని తెలుసు పచ్చని మొక్కల గురించే ఆలోచిస్తున్నాను అలాంటిది పచ్చని సంసారం గురించి ఆలోచించినా అంటుంది కావ్య. ఈ మాటలు డాబా మీద నుంచి విన్న ధాన్యలక్ష్మి ఒక్కసారిగా కంగారు పడుతుంది.