`అమర కావ్యం` మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు.. బాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద ధనుష్‌ రచ్చ

Published : Nov 29, 2025, 02:13 PM IST

Amara Kavyam Collections: ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్, కృతి సనన్, ప్రకాష్ రాజ్ నటించిన హిందీ చిత్రం `అమర కావ్యం`(తేరే ఇష్క్ మే) తొలిరోజు ఎంత వసూలు చేసిందో చూద్దాం.

PREV
14
`అమరకావ్యం` కి పాజిటివ్‌ రెస్పాన్స్

ప్రేమకథా చిత్రం `అమర కావ్యం`(తేరే ఇష్క్ మే) ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. టీ-సిరీస్, కలర్ యెల్లో ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 28న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగులో దీన్ని `అమరకావ్యం` పేరుతో డబ్‌ చేసి విడుదల చేశారు. ధనుష్, కృతి సనన్ నటించిన ఈ సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ తీసిన ఈ మూవీ తన కాలేజీ స్నేహితురాలు ముక్తి (కృతి సనన్)ను ప్రేమించే శంకర్ (ధనుష్) కథను చెబుతుంది. అయితే, ఒక సంఘటన వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. అదేంటన్నదే సినిమా కథ.

24
ధనుష్‌, కృతి సనన్‌ ఫస్ట్ టైమ్‌ జోడీ

ప్రకాష్ రాజ్, ప్రియాంషు పైన్యులి, తోట రాయ్ చౌదరి నటించిన ఈ ప్రేమకథా చిత్రం థియేటర్లలో విడుదలై ఆకట్టుకుంటోంది.  ధనుష్, కృతి సనన్ తొలిసారిగా కలిసి నటించిన సినిమా ఇదే కావడం విశేషం. వీరిద్దరి జోడీ తెరపై ఎంతగానో ఆకట్టుకుంటోంది. ధనుష్ గతంలో దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్‌తో 'రాంజానా', 'అత్రంగి రే' చిత్రాల్లో పనిచేశారు.

34
`అమర కావ్యం` డే 1 కలెక్షన్లు

`అమర కావ్యం`(తేరే ఇష్క్ మే) సినిమా తొలిరోజు వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి. దాని ప్రకారం ఈ సినిమా విడుదలైన తొలిరోజే రూ.16.4 కోట్లు వసూలు చేసింది. దీంతో తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల జాబితాలో 'తేరే ఇష్క్ మే' 9వ స్థానంలో నిలిచింది. అక్షయ్ కుమార్ లేటెస్ట్ హిట్ చిత్రం `జాలీ ఎల్‌ఎల్‌బీ 3` రికార్డును ధనుష్ సినిమా బద్దలు కొట్టింది. దీంతో ధనుష్ బాలీవుడ్‌లో కూడా బాక్సాఫీస్ కింగ్‌గా మారాడు. ఇది బాలీవుడ్‌లోనే 15కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం. అయితే తెలుగులో ఈ సినిమాకి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం. 

44
ధనుష్‌పై కృతి సనన్‌ ప్రశంసలు

ఈ సినిమాలో ధనుష్‌తో కలిసి నటించడంపై హీరోయిన్‌ కృతి సనన్‌ మాట్లాడుతూ,  ధనుష్ ఒక అద్భుతమైన నటుడని ఆమె చెప్పింది. ధనుష్ ప్రతిభకు, నటనకు తాను అభిమానినని వెల్లడించింది.  `అతను తన పని పట్ల చాలా మక్కువ చూపుతాడని నేను నమ్ముతున్నాను. అతను చాలా పర్‌ఫెక్షనిస్ట్ కలవాడు. చాలా చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. సన్నివేశాలను తెరపైకి ఎలా తీసుకురావాలో అతనికి బాగా తెలుసు, అతను అనుభవాల గని. తన పాత్రని అన్ని యాంగిల్స్ లో రక్తికట్టిస్తారు. అతనితో కలిసి పనిచేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను ఎప్పుడూ మంచి టాలెంట్‌ ఉన్న, స్ఫూర్తిని నింపే వ్యక్తులను కనిపెడతానని తెలుసు. ఇప్పుడు అదే జరిగింది` అని పేర్కొంది కృతి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories