నోరు జారిన ధనుష్, తెగ ఆడేసుకుంటన్నారే

Published : Jul 25, 2024, 10:19 AM IST

అసలు మిమ్మల్ని రజినీకాంత్‌తో ఎలా పోల్చుకుంటారు? కొందరు ప్రశ్నించారు. ఆయన కండక్టర్‌ స్థాయి నుంచి సూపర్ స్టార్‌ స్థాయికి సొంతంగా ఎదిగారని ధనుశ్‌కు గుర్తు చేశారు.

PREV
16
నోరు జారిన ధనుష్, తెగ ఆడేసుకుంటన్నారే


ఒక్కోసారి  క్యాజువల్ గా అన్న మాటలు వివాదమైపోతూంటాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు ఆచి,తూచి మాట్లాడకపోతే వేర్వేరు అర్దాలు వచ్చి రచ్చ రచ్చ అయ్యిపోతూంటుంది. ఇప్పుడు ధనుష్ పరిస్దితి అదే అయ్యింది. ఆయన మాటలు వివాదానికి దారి తీసాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. 

26
actor dhanush

 
కోలీవుడ్ స్టార్ ధనుశ్ ప్రస్తుతం రాయన్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఆడియో లాంఛ్‌ ఈవెంట్‌ను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ధనుశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను కిందిస్థాయి నుంచి పైకి వచ్చానని ఈవెంట్‌లో ధనుశ్ మాట్లాడారు. 

36
Raayan


తన కెరీర్‌లో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. వీధుల్లో పెరిగిన నేను.. పోయెస్ గార్డెన్‌లో కోట్ల విలువ చేసే ఇంటిని కొనుగోలు చేశామని వెల్లడించారు. అంతేకాదు సూపర్ స్టార్‌ రజినీకాంత్‌, జయలలిత లాంటి దిగ్గజాలు ఉండే ప్రాంతంలో ఇంటిని కొన్నట్లు పేర్కొన్నారు. నాకు 16 ఏళ్ల వయసులో ఫ్రెండ్‌తో కలిసి రజినీకాంత్‌ ఇంటిని చూసేందుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు

46
Actor Dhanush


. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు రజినీకాంత్ ఇల్లు అని.. ఆ పక్కన జయలలిత ఇల్లు అని చెప్పారని అన్నారు. అప్పుడే నేను చిన్న ఇంటినైనా కొనలేనా? అని మనసులో అనుకున్నానని చెప్పారు. అయితే ధనుశ్‌ చేసిన కామెంట్స్‌పై నెటిజన్స్ మండిపడుతున్నారు. మీరు కష్టపడి పైకొచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీ నాన్న డైరెక్టర్‌.. మీ బ్రదర్ కూడా దర్శకుడే.. అలాంటి మీరు ఎలాంటి టాలెంట్ లేకపోయినా కెరీర్‌ తొలి రోజుల్లో నెట్టుకొచ్చావని అన్నారు. 

56
Raayan


మీరు పోయెస్ గార్డెన్‌లో ఇల్లు మీలాంటి వారికి పెద్ద విషయమే కాదన్నారు. అసలు మిమ్మల్ని రజినీకాంత్‌తో ఎలా పోల్చుకుంటారు? కొందరు ప్రశ్నించారు. ఆయన కండక్టర్‌ స్థాయి నుంచి సూపర్ స్టార్‌ స్థాయికి సొంతంగా ఎదిగారని ధనుశ్‌కు గుర్తు చేశారు. ఆయన కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవడం వల్లే మీకు గుర్తింపు వచ్చిందని సెటైర్స్ వేస్తున్నారు.  
 

66
Actor Dhanushs Raayan


కాగా.. ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  రాయన్ ను సన్ పిక్టర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. 50వ సినిమా కాబట్టి ధనుష్ చాలా జాగ్రత్తలు తీసుకుని దర్శకత్వం వహించి ‘రాయన్ ‘లో నటించాడు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఎస్.జె. సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.   2024 ప్రారంభంలో ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా విడుదలై పరాజయం పాలైంది. ఇప్పుడు ‘రాయన్ ’ సినిమాతో విజయం సాధించేలా కనిపిస్తున్నారు.  

click me!

Recommended Stories