హైదరాబాద్‌లో జరిగిన కుబేర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను తాకాయి. ఈ సందర్భంగా తెలుగు సినిమాలపై తన ఆసక్తిని పంచుకున్న ధనుష్, "అవకాశం కలిగితే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలనుంది" అంటూ ప్రకటించాడు. ధనుష్ కామెంట్స్ తో ఆడిటోరియం మొత్తం ఈలలు, కేకలతో మోతెక్కింది.
25
పవన్ పై ధనుష్ అభిమానం
పవన్ కళ్యాణ్ పై ధనుష్ తన ఇష్టాన్ని ప్రదర్శించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా ధనుష్ తనకి తెలుగులో ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్ అని తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రష్మిక మందన్నా, నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
35
ముఖ్య అతిథిగా రాజమౌళి
ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర బృందం మొత్తం హాజరయ్యింది. ఈ వేడుకకు ఎస్.ఎస్. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ ధనుష్ ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది.
తమిళంలో మీరు కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అవకాశం వస్తే ఏ హీరోతో సినిమా చేస్తారు అని సుమ ప్రశ్నించగా.. ధనుష్ వెంటనే పవన్ కళ్యాణ్ సార్ తో అని బదులిచ్చారు. ధనుష్ సమాధానంతో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ఒకటో తారీఖు కష్టాలు మీకూ ఉంటాయా అని సుమ ప్రశ్నించింది. ధనుష్ బదులిస్తూ నాక్కూడా ఉంటాయి. మీరు రూ. 150 సంపాదిస్తే 200 సమస్యలు ఉంటాయి. నేను కోటి సంపాదిస్తే 2 కోట్ల సమస్యలు ఉంటాయి అని ధనుష్ తెలిపారు.
55
తెలుగులో మరిన్ని చిత్రాలు
ధనుష్.. పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలన్న కోరిక అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రస్తుతం ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కుబేర కనుక విజయం సాధిస్తే తెలుగులో ధనుష్ నుంచి మరిన్ని చిత్రాలు ఆశించవచ్చు.