`దేవర 2`పై అనుమానాలను ఎన్టీఆర్‌ క్లారిటీ.. ప్రభాస్‌కి పోటీగా తారక్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌

Published : Jun 15, 2025, 09:07 PM IST

ఎన్టీఆర్‌ తాజాగా దర్శకుడు కొరటాల శివతో చేయాల్సిన `దేవర 2` సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

PREV
15
`దేవర 2`పై తారక్‌ క్లారిటీ ఇదే

యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్‌ తాజాగా ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. `దేవర 2` సినిమా ఉంటుందా? లేదా? అనే రూమర్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన  క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపారు. 

నేడు ఆదివారం( జూన్‌ 15న )న దర్శకుడు కొరటాల శివ పుట్టిన రోజు. ట్విట్టర్‌ ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్‌ చెప్పారు తారక్‌. ఈ సందర్భంగానే కొరటాలతో కలిసి పనిచేయడానికి ఆతృతగా ఉన్నట్టు వెల్లడించారు. పరోక్షంగా ఆయన `దేవర 2` కోసం వెయిట్‌ చేస్తున్నట్టు తెలిపారు.

25
త్రివిక్రమ్‌ తో మూవీ ప్రకటనతో `దేవర 2`పై కన్‌ఫ్యూజన్‌

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో చివరగా `దేవర` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీకి డివైడ్‌ టాక్‌ వచ్చినా, మంచి విజయం సాధించింది. ముఖ్యంగా నార్త్ లో బాగా ఆడింది. హిందీలో ఇది మంచి కలెక్షన్లని రాబట్టింది. దీంతో `దేవర 2`కి లైన్‌ క్లీయర్‌ అయ్యిందని చెప్పొచ్చు.

త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ స్టార్ట్ కాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్టార్ట్ అని తెలిసింది. కానీ ఇటీవల త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయ్యిందనే వార్తతో `దేవర 2` క్యాన్సిల్‌ అయ్యిందా? అనే రూమర్స్ వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా తారక్‌ పోస్ట్ ఆ రూమర్స్ కి చెక్‌ పెట్టింది.

35
`వార్‌ 2`, `డ్రాగన్`లతో రాబోతున్న ఎన్టీఆర్‌

ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సినిమాల లైనప్‌ ఓ సారి చూస్తే, ప్రభాస్‌కి పోటీ ఇస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే తారక్‌ హిందీలోకి ఎంట్రీ ఇచ్చి `వార్‌ 2`లో నటించారు. ఇందులో హృతిక్‌ రోషన్‌ మరో హీరో. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కాబోతుంది. దీంతోపాటు ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు తారక్‌. దీనికి `డ్రాగన్‌` అనే టైటిల్‌ అనుకుంటున్నారట. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇది వచ్చే ఏడాది ప్రథమార్థంలో రానుంది.

45
త్రివిక్రమ్‌ తో మైథలాజికల్‌ మూవీ

ఈ మూవీ తర్వాత `దేవర 2` ఉండే అవకాశం ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ ఉంటుంది. అలాగే ఇటీవల త్రివిక్రమ్‌తో సినిమా ఫైనల్‌ అయ్యింది. గతంలోనే వీరి కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది. ఆ స్థానంలో కొరటాలతో `దేవర` వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి పనిచేయబోతున్నారు. 

హారికా అండ్‌ హాసిని బ్యానర్‌లో ఈ మూవీ ఉండబోతుంది. మైథలాజికల్‌ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారట దర్శకుడు త్రివిక్రమ్‌. దీంతోపాటు అదే బ్యానర్‌లో నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో ఓ మూవీ ఉంటుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం ఎన్టీఆర్‌ చేతిలో ఐదు సినిమాలున్నాయి.

55
ఆరు ప్రాజెక్ట్ లతో టాప్‌లో ప్రభాస్‌

టాలీవుడ్‌ స్టార్స్ లో ప్రభాస్‌కి ఉన్న లైనప్‌ మరే హీరోకి లేదు.  ఆయన ఇప్పుడు `రాజా సాబ్‌`తో రాబోతున్నారు. దీంతోపాటు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` మూవీ ప్రారంభించనున్నారు. వీటితోపాటు ప్రశాంత్‌ వర్మతో ఓ సినిమా చేయాల్సి ఉంది. 

అలాగే `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు చేయాల్సి ఉంది. ఇలా ఆరు సినిమాలు కమిట్‌ అయినవి ఉన్నాయి. వీటితోపాటు లోకేష్‌ కనగరాజ్‌తో ఓ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇలా అత్యధిక సినిమాల లైనప్‌తో ప్రభాస్‌ మొదటి స్థానంలో ఉండగా, ఇప్పుడు తారక్‌ ఆయనకు పోటీగా వస్తుండటం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories