Published : Jul 27, 2026, 04:33 PM ISTUpdated : Jul 27, 2026, 04:40 PM IST
ధనుష్ ఇచ్చిన ఒకే ఒక్క సమాధానంతో అవార్డుపై నడిచిన వివాదం మొత్తం సైడ్ అయిపోయింది. ఆయన మాటలు విన్నవాళ్లు.. ధనుష్ రాజకీయాల్లోకి వస్తారా ఏంటి అని కూడా చర్చించుకుంటున్నారు.
72వ జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత, ధనుష్ 'రాయన్' సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు రావడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 'మెయ్యళగన్', 'మహారాజా' లాంటి సినిమాలకు అర్హత ఉందని చాలామంది అన్నారు. ఈ విమర్శలపై ధనుష్ స్పందిస్తూ, అవార్డును వినయంగా స్వీకరిస్తున్నానని, అనవసర వివాదాలు సృష్టించవద్దని అభిమానులను కోరారు.
25
రాయన్ కన్నా మంచి సినిమాలు ఉన్నాయి
దీనిపై ధనుష్ మాట్లాడుతూ.. 'రాయన్ కన్నా మంచి తమిళ సినిమాలు ఉన్నాయన్నది నిజమే. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాలు మనల్ని వెతుక్కుంటూ అవే వస్తాయి. ఈ అవార్డు కూడా అలాగే వచ్చింది' అని తెలిపారు.
35
తమిళ సినిమా విజయం
అంతేకాదు, 'ఒకే ఏడాదిలో ఒక తమిళ నటుడికి రెండు జాతీయ అవార్డులు రావడం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. దీన్ని నెగటివ్‌గా కాకుండా, తమిళ సినిమా విజయంగా చూడాలి' అని ఆయన నొక్కి చెప్పారు.
జాతీయ అవార్డుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వచ్చాయి. అయితే ధనుష్ ఇచ్చిన ఈ వినయపూర్వక సమాధానం అభిమానులను ఆకట్టుకుంది. కొందరు ఆయన నిజాయితీని మెచ్చుకుంటుండగా, మరికొందరు మాత్రం జాతీయ అవార్డుల ఎంపిక ప్రక్రియపై చర్చను కొనసాగిస్తున్నారు.
55
ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు
'రాయన్' సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు రావడమే కాకుండా, 'కెప్టెన్ మిల్లర్' చిత్రంలో నటనకు గాను ధనుష్‌కు ప్రత్యేక నటుడిగా (స్పెషల్ మెన్షన్) గుర్తింపు కూడా లభించడం విశేషం.